23rd June 2026

__________

- Saidulu

వెన్నునొప్పి తగ్గించడంలో సహాయపడే నువ్వుల చిక్కీ... ఇంట్లోనే చేసేద్దామా?

స్వీట్ షాప్ స్టైల్‌లో పర్ఫెక్ట్ క్రిస్పీ నువ్వుల పట్టి చేయాలనుకుంటున్నారా? కేవలం 15 నిమిషాల్లో దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు!

ఒక కప్పు తెల్ల నువ్వులు, ఒక కప్పు తరిగిన బెల్లం, ఒక చెంచా నెయ్యి, చిటికెడు యాలకుల పొడి (ఆప్షనల్) ఉంటే చాలు.

కావలసిన పదార్థాలు

చిక్కీ వేగంగా గట్టిపడుతుంది, అందుకే ముందే ఒక ప్లేట్ లేదా బట్టర్ పేపర్ పై, చపాతీ కర్రపై కొద్దిగా నెయ్యి రాసి పక్కన పెట్టుకోండి.

ముందస్తు తయారీ

బాణలిలో నువ్వులు వేసి, చిన్న మంటపై 4-5 నిమిషాలు చిటపటలాడే వరకు వేయించాలి. రంగు మారకుండా చూసుకుని వేరే గిన్నెలోకి తీయండి.

నువ్వులు వేయించడం

అదే బాణలిలో ఒక చెంచా నెయ్యి, తరిగిన బెల్లం వేయాలి. ఒకటి లేదా రెండు చెంచాల నీళ్లు పోసి, బెల్లాన్ని పూర్తిగా కరిగించాలి.

బెల్లం కరిగించడం

బెల్లం బుడగలు వస్తున్నప్పుడు, కొన్ని చుక్కల పాకాన్ని చల్లని నీళ్లలో వేయాలి. అది సాగకుండా, చాక్లెట్‌లా 'టక్' మని విరగాలి.

పాకం టెస్ట్ 

పాకం రాగానే మంట ఆపేసి, వేయించిన నువ్వులు, యాలకుల పొడి వేసి బెల్లం మొత్తం నువ్వులకు పట్టేలా వేగంగా కలపాలి.

కలపడం

ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లేదా పేపర్ పై వేసి, నెయ్యి రాసిన చపాతీ కర్రతో మీకు కావలసిన మందంలో సమానంగా ఒత్తాలి.

 మిశ్రమం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చాకు లేదా పిజ్జా కట్టర్‌తో చతురస్రాకారంలో గాట్లు పెట్టాలి. గట్టిపడితే కోయడం కుదరదు.

పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలను వేరు చేసి, ఎయిర్ టైట్ కంటైనర్‌లో దాచుకుంటే నెల రోజుల పాటు కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి!