జూన్ 26న శాన్ హోసేలో రాక్‌స్టార్ డీఎస్పీ ‘లైవ్ ఇన్ కన్సర్ట్’.. బాటా ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు!
అమెరికాలోని ప్రవాస తెలుగు ప్రేక్షకులకు సరికొత్త సంగీత విందును అందించేందుకు సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) కాలిఫోర్నియా వస్తున్నారు. ప్రముఖ ప్రవాస సంస్థ బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA), బే ఏరియా ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో “రాక్ స్టార్ డీఎస్పీ లైవ్ ఇన్ కన్సర్ట్” అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. “బ్యాక్ అగైన్ ఇన్ ది బే!” అనే స్లోగన్ తో వస్తున్న ఈ మెగా లైవ్ షో జూన్ 26, 2026 (శుక్రవారం) సాయంత్రం శాన్ హోసే సివిక్ సెంటర్లో అత్యంత వైభవంగా జరగనుంది.
ఈ భారీ కాన్సర్ట్‌కు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. టికెట్ల అమ్మకాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయని, గ్రూప్ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.
ప్రముఖ సింగర్ల హంగామా..
ఈ లైవ్ ఇన్ కన్సర్ట్‌లో రాక్‌స్టార్ డీఎస్పీతో పాటు టాలీవుడ్‌కు చెందిన ఎంతో మంది క్రేజీ ప్లేబ్యాక్ సింగర్స్ ఒకే వేదికపై సందడి చేయనున్నారు. వారిలో రీటా, సమీరా భరద్వాజ్, సాగర్, కార్తీక్ మాల్యాల తమ అద్భుతమైన పాటలతో వేదికపై జోష్ నింపనున్నారు.
మరిచిపోలేని అనుభూతి, సంగీతంతో సాగనున్న ఈ వేడుక టికెట్ల కోసం కస్టమర్లు bata.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని లేదా 510-421-3535, 650-776-1203 నంబర్ల ద్వారా సమాచారం తెలుసుకోవచ్చని, స్పాన్సర్షిప్ కోసం 408-242-5111 నంబర్‌ను సంప్రదించవచ్చని బాటా ప్రతినిధులు ఒక ప్రకటనలో కోరారు.








