జులై 31 నుంచి బాల్టిమోర్‌లో భీమ్స్ సిసిరోలియో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్
ATA: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ’19వ ఆటా కాన్ఫరెన్స్ , యూత్ కన్వెన్షన్’ వేదిక సిద్ధమైంది. ఈ కార్యక్రమం జులై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు బాల్టిమోర్‌లోని ‘బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో’ నిర్వహించనున్నారు.
ప్రత్యేక ఆకర్షణలు..
ఈ కన్వెన్షన్‌లో భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) సారథ్యంలో ‘లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్’ , ‘నిరవల్’ (Niraval) లైవ్ మ్యూజిక్ బ్యాండ్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు , అతిథులు పాల్గొననున్నారు.
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఈ కన్వెన్షన్‌లో పాల్గొనాలనుకునే వారు , తమ పేర్లను నమోదు చేసుకోవాలనుకునే వారు https://ataconference.org/My-Account/Event-Registration వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు కొరుతున్నారు.








