TCA 50 స్వర్ణోత్సవ వేడుకలు.. నృత్య కళాకారులు, నటీనటులకు ఆహ్వానం
TCA: హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (TCA) తమ 50వ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ప్రతిష్టాత్మకమైన ‘స్వాగత గీతం’ , ‘స్వర్ణ వైభవం’ అనే ప్రత్యేక దృశ్య కావ్యాలను రూపొందిస్తోంది. ఈ ప్రదర్శనల్లో పాల్గొనడానికి నృత్య కళాకారులు , నటీనటుల కోసం సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు..
మొత్తం 75 మంది నృత్య కళాకారులు , నటీనటులు కావాలి.
10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి.
భరతనాట్యం, కూచిపూడి, జానపదం, బాలీవుడ్ , ఇండియన్ ఫ్యూజన్ వంటి విభాగాల్లో ప్రావీణ్యం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
జూన్ 10 నుండి ఆగస్టు 8, 2026 మధ్య రిహార్సల్స్ జరుగుతాయి, ఇందులో పాల్గొనడం తప్పనిసరి.
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఆసక్తి గల వారు జూన్ 10, 2026 లోపు రిజిస్టర్ చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం రామ్ చెరువు (832-754-7802)ను సంప్రదించవచ్చు లేదా dance@tca50.org కి మెయిల్ చేయవచ్చు.








