అట్లాంటా, రాలీలలో ముగిసిన TTA బ్యూటీ పీజెంట్ పోటీలు
TTA: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన “TTA మెగా కన్వెన్షన్ 2026” సంబరాల్లో భాగంగా అమెరికాలోని రెండు ప్రముఖ నగరాలైన అట్లాంటా, రాలీలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యూటీ పీజెంట్ (సౌందర్య పోటీలు) ఆదివారం (జూన్ 7న) అత్యంత వైభవంగా ముగిశాయి. స్థానిక ప్రవాస తెలుగు వారి నుండి ఈ పోటీలకు అద్భుతమైన స్పందన లభించింది.
ఉత్సాహంగా సాగిన పోటీలు..
1. అట్లాంటా బ్యూటీ పీజెంట్ ..
జాన్స్ క్రీక్‌లోని ‘కిస్మత్’ వేదికగా ఉదయం 10:00 గంటల నుండి ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. స్థానిక కోఆర్డినేటర్ శ్వేతా రెడ్డి నిమ్మల (అట్లాంటా టాలెంట్ & పీజెంట్ లీడ్) ఆధ్వర్యంలో మెంటార్లు లక్ష్మి మందవిల్లి, అనుజ గొల్ల, రిషికా రావు దిగ్గాల నేతృత్వంలో పోటీదారులు తమ ప్రతిభను కనబరిచారు.
2. రాలీ బ్యూటీ పీజెంట్ ..
నార్త్ కరోలినా, అపెక్స్లోని ‘క్యురేట్ స్టూడియో’లో సాయంత్రం 5:00 గంటలకు ఈ పోటీలు ఘనంగా నిర్వహించారు. శ్వేతా గుండపనేని (చైర్), దీపికా చిత్తిమూరి (కో-చైర్), గీతిక పిల్లలమర్రి (కో-చైర్) లతో పాటు లోకల్ కోఆర్డినేటర్లు నిత్యా గింజుపల్లి, గౌతికా చెన్నమనేని, సౌజన్య బదిశెట్టిల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
ఐదు విభాగాల్లో ప్రతిభా ప్రదర్శన..
ఈ రెండు నగరాల్లోనూ మిస్ టీన్ TTA (13-19 ఏళ్లు), మిస్ TTA (20+ ఏళ్లు), మిసెస్ TTA (వివాహిత మహిళలు), మిస్టర్ TTA (20+ ఏళ్లు), , మిస్టర్ టీన్ TTA (13-19 ఏళ్లు) అనే ఐదు విభాగాలలో పోటీలు జరిగాయి. పోటీదారులు తమ ఆత్మవిశ్వాసం, సంస్కృతి, , వేదికపై ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు.
షార్లెట్ మెగా కన్వెన్షన్ ఫైనల్స్ దిశగా..
ఈ ప్రాంతీయ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ప్రముఖ సెలబ్రిటీల చేతుల మీదుగా కిరీటధారణ జరిగింది. ఇక్కడ ఎంపికైన ఫైనలిస్ట్‌లు జూలై 17 నుండి 19 వరకు నార్త్ కరోలినాలో జరగబోయే TTA మెగా కన్వెన్షన్ 2026 గ్రాండ్ ఫైనల్స్‌లో తలపడనున్నారు.
ఈ ఈవెంట్లను ఇంతటి ఘనంగా విజయవంతం చేసినందుకు TTA ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వీనర్ ప్రవీణ్ చింత, కోఆర్డినేటర్లు నరేన్ దేవరపల్లి, శేఖర్ రెడ్డి , ఈసీ, బీఓడీ, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు స్థానిక చాప్టర్ బృందాలకు, వాలంటీర్లకు, స్పాన్సర్లకు , మద్దతుగా నిలిచిన తెలుగు కమ్యూనిటీకి తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.








