జూన్ 20న ఫిలడెల్ఫియాలో మాటా లీగల్ ఫోరమ్ ప్రత్యేక సదస్సు
MATA : మన అమెరికా తెలుగు సంఘం (మాటా) ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన “మాటా 2వ కన్వెన్షన్ – 26” మహాసభల వేదికగా ప్రవాస తెలుగువారి కోసం ప్రత్యేకంగా ‘లీగల్ ఫోరమ్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జూన్ 19 నుండి జూన్ 20, 2026 వరకు గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్లో ఈ మహాసభలు జరగనున్నాయి.
వివరాలు..
మహాసభల్లో భాగంగా జూన్ 20వ తేదీ శనివారం మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు ఈ లీగల్ ఫోరమ్ సదస్సు జరగనుంది. ప్రవాసులకు ఎదురయ్యే పలు చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
చర్చించబోయే అంశాలు..
ఇమ్మిగ్రేషన్ చట్టాలు & పాలసీలు
కుటుంబ & చట్టపరమైన సమస్యలు
రియల్ ఎస్టేట్ చట్టాలు & లావాదేవీలు
బిజినెస్ లా & నిబంధనల అమలు
ప్రముఖ న్యాయ నిపుణుల నేతృత్వంలో..
ఈ సదస్సులో అమెరికాలోని ప్రముఖ న్యాయ నిపుణులు మోడరేటర్లు, ప్రెజెంటర్లుగా వ్యవహరించి సందేహాలను నివృత్తి చేయనున్నారు. వారిలో సోమిరెడ్డి లా గ్రూప్ ఫౌండింగ్ పార్ట్నర్ సంతోష్ ఆర్.సోమిరెడ్డి, కంప్యూనెల్ ఇంక్ జనరల్ కౌన్సెల్ ప్రేమా రొద్దం, పటూరి లా ఫౌండింగ్ పార్ట్నర్ మధురిమ పటూరి పాల్గొననున్నారు. ఈ లీగల్ ఫోరమ్‌కు ప్రేమా రొద్దం అడ్వైజర్‌గా వ్యవహరిస్తుండగా, కళ్యాణి బెల్లంకొండ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు.








