నాష్‌విల్లేలో టెన్నెస్సీ తెలుగు సమితి పికిల్‌బాల్ టోర్నమెంట్ ఘన విజయం
TTS: అమెరికాలోని నాష్‌విల్లేలో టెన్నెస్సీ తెలుగు సమితి (TTS) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మెన్స్ డబుల్స్ పికిల్‌బాల్ టోర్నమెంట్’ (Men’s Doubles Pickleball Tournament) అత్యంత వైభవంగా ముగిసింది. స్థానిక తెలుగు కమ్యూనిటీని ఒకే తాటిపైకి తీసుకురావడంతో పాటు క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ఈ క్రీడా సంబరానికి అద్భుతమైన స్పందన లభించింది.
ఈ టోర్నమెంట్లో మొత్తం 21 జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి. నాలుగు కోర్టుల్లో లీగ్ ఫార్మాట్ పద్ధతిలో అత్యంత వేగంగా, హోరాహోరీగా ఈ మ్యాచ్‌లు జరిగాయి. ఈ టోర్నమెంట్లో పాల్గొన్న వారు తమ అద్భుతమైన నైపుణ్యాలు, టీమ్‌వర్క్ , పట్టుదలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.
ఉత్కంఠభరితమైన సెమీ ఫైనల్స్..
సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగాయి. మొదటి సెమీఫైనల్ మ్యాచ్ ‘కిచెన్ నింజాస్’ (సుమన్ పాకాల & జేసన్ పసానిస్) వర్సెస్ ‘నాసా’ (నందన్ గౌడ & సత్యం పైలా) జట్ల మధ్య జరగ్గా.. రెండవ సెమీఫైనల్ మ్యాచ్ ‘దేశీ క్రూ’ (శ్రీనివాస్ మెర్నీడి & సత్య అక్కిన) వర్సెస్ ‘ర్యాలీ రెబెల్స్’ (విశ్రుత్ రెడ్డి & రవి కె) జట్ల మధ్య హోరాహోరీగా సాగింది.

టోర్నమెంట్ విజేతలు..
ఛాంపియన్స్ (మొదటి స్థానం): కిచెన్ నింజాస్ (సుమన్ పాకాల & జేసన్ పసానిస్)
రన్నర్స్-అప్ (రెండవ స్థానం): దేశీ క్రూ (శ్రీనివాస్ మెర్నీడి & సత్య అక్కిన)
మూడవ స్థానం: ర్యాలీ రెబెల్స్ (విశ్రుత్ రెడ్డి & రవి కె)
ఈ క్రీడా ఈవెంట్‌ను విజయవంతం చేసిన విజేతలకు, రన్నర్స్‌కు , పాల్గొన్న క్రీడాకారులందరికీ టెన్నెస్సీ తెలుగు సమితి ప్రతినిధులు హారిక కనగాల, విష్ణు నెల్లూరి తదితరులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ టోర్నమెంట్‌ను ఎలాంటి అడ్డంకులు లేకుండా సురక్షితంగా, అద్భుతంగా నిర్వహించేందుకు సహకరించిన నిర్వాహకులకు, వాలంటీర్లకు , మద్దతుదారులకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆటగాళ్లలో కనిపించిన ఉత్సాహం, పోటీతత్వం , స్నేహభావం ఈ టోర్నమెంట్‌ను టీటీఎస్ (TTS) చరిత్రలో మరొక మైలురాయిగా నిలిపాయని పేర్కొన్నారు.








