జులై 17 నుండి 19 వరకు టీటీఏ కన్వెన్షన్‌లో రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ లైవ్ పర్ఫార్మెన్స్
TTA : అమెరికాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో జులై 17 నుండి 19, 2026 వరకు ‘తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం’ (TTA) ఆధ్వర్యంలో ‘మెగా కన్వెన్షన్’ అత్యంత ఘనంగా జరగనుంది.
ప్రధాన ఆకర్షణ..
ఈ కన్వెన్షన్ ప్రధాన ఆకర్షణగా టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) తన లైవ్ మ్యూజికల్ పర్ఫార్మెన్స్తో అలరించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు హాజరుకానున్నారు.
‘ఎల్లమ్మ’ మూవీ సాంగ్ లాంచ్..
జులై 18, 2026న దేవి శ్రీ ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఎల్లమ్మ’ (Yellamma) సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సాంగ్ లాంచ్ , స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ నిర్వహించనున్నారు.
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఆసక్తి ఉన్న వారు ‘ttaconvention.org’ వెబ్సైట్ ద్వారా లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.








