అమెరికాలో తొలి సారిగా పెద్ద రేంజ్ లో ‘పెద్ది’ 360 థియేటర్లలో విడుదల చేస్తున్న ‘ప్రత్యంగిర సినిమాస్’
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పెద్ది’తో వెండితెరపై వచ్చే నెల జూన్ 4న సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు బుచ్చి బాబు సానా దర్శకత్వంలో,షార్ఫ్, ఎమోషనల్ డెప్త్ తీసుకురావడంలో పేరుపొందిన జాతీయ అవార్డు గ్రహీత, ఎడిటర్ నవీన్ నూలి, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, బలమైన భావోద్వేగాలతో రూపొందుతున్న ‘పెద్ది’ పాన్ ఇండియా స్థాయిలో పలు దక్షిణ, ఉత్తర భారత భాషలతో పాటు హిందీలో విడుదల కానుంది.
అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచుతూ జూన్ 3 నుంచే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా USA లో ‘ప్రత్యంగిర సినిమాస్’ ద్వారా విజయ్ వట్టికూటి భారీ ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ‘పెద్ది’ ఓ హిస్టారిక్ ఓపెనింగ్‌కి సిద్ధమవుతోంది. డిమాండ్ దృష్ట్యా ప్రీమియర్ టికెట్ ధరలను $40 నిర్ణయించగా… దీనిపై సోషల్ మీడియాలో కొంత చర్చ కూడా నడిచింది. ఐయినా సరే ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి..మరోవైపు టికెట్ రెట్లపై యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు స్పందిస్తూ.. స్పెషల్ ఫార్మాట్స్ (PLF, D-BOX) వల్లే ధరలు ఎక్కువగా ఉన్నాయని వివరణ ఇచ్చారు. నార్త్ అమెరికాలో ఈ మూవీ సంచలనం సృష్టిస్తూ, రిలీజ్‌కు ముందే ప్రీమియర్ ప్రీ-సేల్స్ ద్వారా ఇప్పటికే హాఫ్ మిలియన్‌కు పైగా కలెక్షన్లను అధిగమించింది తెలుస్తోంది. కాగా ఈ చిత్రం అమెరికాలో తొలి సారిగా 360 స్క్రీన్ లలో ఒకే సారి విడుదల చేస్తూ విడుదలకు ముందే సంచలనం సృటించడం విశేషం.
USA లో విడుదల అవుతున్న థియేటర్స్ ( స్క్రీన్స్ ) వివరాలు ఇక్కడ PDF లింక్ ఇవ్వడం జరిగింది.
ఇవి కూడా చదవండి







