గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీంకోర్టులో విచారణ
తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ (MLC)ల నియామకంపై అమీర్ అలీఖాన్ (Aamir Ali Khan), అజారుద్దీన్ (Azharuddin) దాఖలు చేసిన ఇంటర్ లోకేటరీ అప్లికేషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరిగింది. కేసు విచారణ జులై 22న చేపట్టనున్నట్టు ఇప్పటికే ప్రకటించామని ధర్మాసనం తెలిపింది. గత విచారణలో కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని అజారుద్దీన్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. గతంలో గవర్నర్ (Governor) తనపేరు సూచించి, తర్వాత నిర్ణయం మార్చుకున్నారని అమీర్ ఖాన్ తెలిపారు. మంత్రివర్గ నిర్ణయం ప్రకారం జరిగిన దానికి గవర్నర్ ఏం చేస్తారని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. ఇరువురి అప్లికేషన్లను ప్రధాన కేసుతోనే విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. రెండు అప్లికేషన్లపై ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ జులై 22 కి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి







