14 ఏళ్ళ నాటి, క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ..!
ఐపీఎల్ (IPL 2026) క్రికెట్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం లిఖించాడు 15 ఏళ్ళ వైభవ్ సూర్యవంశి(Vaibhav Suryavanshi). రాజస్థాన్ రాయల్స్(RR) జట్టుకు ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల వేటలో సరికొత్త రికార్డును సృష్టించాడు. ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్(Chris Gayle) పేరిట ఉన్న 14 ఏళ్ల నాటి రికార్డును ఈ యువ ఆటగాడు అధిగమించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుతో జరిగిన కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ ఈ అరుదైన మైలురాయిని అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఇవి కూడా చదవండి
గతంలో 2012 ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) తరఫున ఆడిన క్రిస్ గేల్ రికార్డు స్థాయిలో 59 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత 2019లో ఆండ్రీ రస్సెల్ 52 సిక్సర్లు, 2013లో గేల్ 51 సిక్సర్లు కొట్టారు. అయితే తాజా మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బౌలర్ సాకిబ్ హుస్సేన్ వేసిన ఓవర్లో వరుస సిక్సర్లతో విరుచుకుపడిన వైభవ్, ఈ సీజన్లో తన మొత్తం సిక్సర్ల సంఖ్యను ఏకంగా 61కి చేర్చి గేల్ రికార్డును తుడిచిపెట్టేశాడు. ఈ ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి సెంచరీకి కేవలం మూడు పరుగుల దూరంలో ప్రఫుల్ హింగే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్(Pat Cummins), ఈషాన్ మలింగ వంటి దిగ్గజ బౌలర్ల వ్యూహాలను చిత్తు చేస్తూ మైదానం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ అసాధారణ ప్రదర్శనతో వైభవ్‌ను సీనియర్ జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ క్రికెట్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. వచ్చే నెలలో తిలక్ వర్మ సారథ్యంలో శ్రీలంకలో పర్యటించబోయే ‘ఇండియా-ఎ’ జట్టులో అతను ఇప్పటికే ఎంపికయ్యాడు. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ సైతం వైభవ్‌ను “అసాధారణ ప్రతిభావంతుడు” అని కొనియాడారు.
ఇవి కూడా చదవండి







