ఎన్టీఆర్ లేకుండానే ముందుకు వెళ్తున్న డ్రాగన్ టీమ్!
గత కొద్దిరోజులుగా జూ. ఎన్టీఆర్(Jr. NTR) నటిస్తున్న డ్రాగన్(Drgon) సినిమా గురించి సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. భుజానికి సంబంధించిన గాయంతో డాక్టర్లు ఆయనకు ఆరు వారాల రెస్ట్ చెప్పారని వార్తలు రావడంతో, సినిమా షూటింగ్ పూర్తిగా ఆగిపోయిందని, ఈ కారణంగా రిలీజ్ ప్లాన్ కూడా మారే అవకాశం ఉందని పలు ఊహాగానాలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రచారాల్లో వాస్తవం లేదని తెలుస్తోంది. సినిమా షూటింగ్ యథావిధిగా కొనసాగుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఎన్టీఆర్ లేని సీన్స్ పై మేకర్స్ దృష్టి పెట్టారని సమాచారం. ఇతర నటీనటులతో కూడిన కాంబినేషన్ సీన్స్, అలాగే ఇండిపెండెంట్ గా షూట్ చేయగలిగే సీక్వెన్స్ ను పూర్తి చేసే విధంగా షెడ్యూల్‌ను రీడిజైన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో హీరో అందుబాటులో లేకపోయినా ప్రొడక్షన్ వేగం తగ్గకుండా చూసుకుంటున్నారు. పెద్ద సినిమాల్లో ఇలాంటి ప్లానింగ్ సాధారణమే అయినప్పటికీ, డ్రాగన్ టీమ్ ఈ దశను సమర్థంగా మేనేజ్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది.
మరోవైపు ఎన్టీఆర్ ఆరోగ్యం విషయంలో కూడా సానుకూల సంకేతాలే కనిపిస్తున్నాయి. ట్రీట్మెంట్ కు ఆయన బాగా రియాక్ట్ అవుతున్నారని, కోలుకునే ప్రక్రియ అనుకున్న విధంగానే సాగుతోందని సమాచారం. డాక్టర్లు పర్మిషన్ ఇచ్చిన వెంటనే ఆయన మళ్లీ సెట్స్‌లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో షూటింగ్ షెడ్యూల్లో పెద్ద అంతరాయం ఏర్పడే అవకాశాలు ప్రస్తుతం కనిపించడం లేదు. మొత్తంగా చూస్తే, డ్రాగన్ సినిమా ప్రొడక్షన్ ప్లాన్ గాసిప్స్ ప్రభావానికి గురికాకుండా నిర్ణయించిన దిశలోనే ముందుకు సాగుతోందనే అభిప్రాయం బలపడుతోంది.








