రవి మోహన్ డ్యాన్స్ వీడియో వెనుక అసలు కారణమదేనా?
ఈ వీడియోలో రవి మోహన్ ఎరుపు రంగు దుస్తుల్లో కనిపించడం కూడా అభిమానుల డిస్కషన్ కు కారణమైంది. ఆదివారం రోజున రెడ్ కలర్ దుస్తులు ధరించడం తనకు చిన్నప్పటి నుంచే అలవాటని ఆయన గతంలో చెప్పిన విషయాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. అదే అలవాటును కొనసాగిస్తూ ఈ వీడియోలో కూడా అదే రంగు దుస్తుల్లో కనిపించడం ఫ్యాన్స్ కు స్పెషల్ గా అనిపించింది. అయితే ఈ ఆనందం వెనుక అసలు కారణం ఆయన ప్రారంభించిన కొత్త క్రియేటివ్ జర్నీనే అని తెలుస్తోంది.
డైరెక్టర్ గా రవి మోహన్ రూపొందిస్తున్న మొదటి సినిమా యాన్ ఆర్డినరీ మ్యాన్ కు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి నుంచి లభించిన ప్రశంసలు తనకు ఎంతో భావోద్వేగాన్ని కలిగించాయని రవి మోహన్ వెల్లడించారు. సినిమా నుంచి కొన్ని సన్నివేశాలు, ఒక పాటను తల్లిదండ్రులు, అన్న మోహన్ రాజాకు చూపించగా వారు ఇచ్చిన అభినందనలు తనకు అపారమైన ప్రోత్సాహాన్ని ఇచ్చాయని తెలిపారు. తండ్రి ప్రశంస ప్రతి బిడ్డకు దక్కాలని కోరుకుంటూ చేసిన ఆయన పోస్ట్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ డ్యాన్స్ వీడియో కేవలం వినోదం మాత్రమే కాదు, ఆయన లైఫ్ లో కొత్త అధ్యాయం ప్రారంభమైన సంకేతంగా కూడా చాలామంది భావిస్తున్నారు.








