ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర..!
ఐపీఎల్ 2026(IPL 2026) సీజన్లో రాజస్థాన్ రాయల్స్(RR) యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi).. రికార్డులను తిరగరాస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ కుర్రాడు, తాజాగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 400 పరుగుల మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఎదుర్కొన్న బంతుల పరంగా చూస్తే, వైభవ్ కేవలం 167 బంతుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. గతంలో ఆండ్రీ రసెల్.. 188 బంతులు పేరిట ఉన్న రికార్డును ఈ యువ ఆటగాడు తుడిచిపెట్టేశాడు.
నిన్న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 16 బంతుల్లో 43 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ ద్వారానే అతను ఈ ఫీట్ సాధించాడు. వైభవ్ బ్యాటింగ్ శైలి ఈ సీజన్లో ప్రత్యర్థి బౌలర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అతను సాధించిన 400 పరుగులలో సుమారు 319 పరుగులు కేవలం పవర్‌ప్లే ఓవర్లలోనే రావడం అతని విధ్వంసానికి నిదర్శనం.
240కి పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ, ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు మెరుపు ఆరంభాలను అందిస్తున్నాడు. కేవలం బౌండరీలతోనే కాకుండా, మైదానం నలుమూలలా షాట్లు ఆడుతూ ‘నయా సెన్సేషన్’గా మారిపోయాడు. గత సీజన్లోనే అతను గుజరాత్ టైటాన్స్‌పై సెంచరీ సాధించి, టీ20 క్రికెట్ చరిత్రలో అతి పిన్న వయస్సులో సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కూడా కేవలం 36 బంతుల్లోనే శతకం బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతి తక్కువ ధరకే వేలంలో అమ్ముడైన ఈ బీహార్ కుర్రాడు, ఇప్పుడు ఐపీఎల్ విలువైన ఆటగాళ్ల జాబితాలో చేరిపోవడం గమనార్హం.
ఇవి కూడా చదవండి







