మే 30న ‘మాటా’ ఆధ్వర్యంలో మదర్స్ డే స్పెషల్ ఉమెన్స్ ప్యానెల్ వెబినార్
MATA: మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) మాతృ దినోత్సవాన్ని (Mother’s Day) పురస్కరించుకుని మహిళా సాధికారత, నాయకత్వ లక్షణాలపై ప్రత్యేకంగా ఒక అంతర్జాతీయ ఉమెన్స్ ప్యానెల్ (Women’s Panel) వెబినార్‌ను నిర్వహించబోతోంది. “హానరింగ్ హర్ వాయిస్, పవర్ అండ్ లెగసీ” (Honoring Her Voice, Power and Legacy) అనే థీమ్‌తో ఈ కార్యక్రమం జరగనుంది.
వివరాలు..
ఈ ఆన్లైన్ వెబినార్ 2026 మే 30వ తేదీ శనివారం మధ్యాహ్నం 12:00 గంటల నుండి 1:00 గంటల వరకు (EST) జూమ్ (Zoom) యాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానుంది. సమాజంలో వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళా పారిశ్రామికవేత్తలు, న్యాయ నిపుణులు , సామాజిక కార్యకర్తలు ఈ ప్యానెల్లో పాల్గొని తమ అనుభవాలను, విజయ ప్రస్థానాన్ని పంచుకోనున్నారు.
ప్యానెల్ ప్రతినిధుల వివరాలు..
- కల్యాణి బెల్లంకొండ (మోడరేటర్): మాటా కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్ & కన్వెన్షన్ కోఆర్డినేటర్.
- ప్రేమ రొద్దం, Esq. (ప్యానెలిస్ట్): కాంప్యూనెల్ ఇంక్ జనరల్ కౌన్సెల్, మనవి ఇంక్ ప్రెసిడెంట్-BOD.
- మధురిమ పాతూరి, Esq. (ప్యానెలిస్ట్): పాతూరి లా ఫౌండింగ్ పార్ట్నర్, శక్తి-USA ప్రెసిడెంట్.
- క్లాడియా నానాబెయా అడ్డో-త్వూమ్ (ప్యానెలిస్ట్): రచయిత్రి, యూత్ డెవలప్మెంట్ అడ్వకేట్.
- దియా మాథ్యూస్ (ప్యానెలిస్ట్): చుగ్ LLP మేనేజింగ్ పార్ట్నర్, TiE న్యూజెర్సీ ప్రెసిడెంట్.
- హిబా ఇక్రామ్ (ప్యానెలిస్ట్): ఎకో చేంజ్ కో-ఫౌండర్, యూనైటెడ్ స్టేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ యూత్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్.
ఈ ఉచిత వెబినార్‌లో పాల్గొనదలచిన వారు (https://tinyurl.com/matazoom) లింక్ ద్వారా లేదా పోస్టర్‌లోని క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేసి జాయిన్ అవ్వవచ్చని మాటా కార్యవర్గ సభ్యులు తెలిపారు. అలాగే 2026 జూన్ 19, 20 తేదీల్లో పెన్సిల్వేనియాలోని ‘ది గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్’లో జరగబోయే “మాటా 2వ కన్వెన్షన్ 2026” మహాసభలను కూడా విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.
ఇవి కూడా చదవండి







