ఆగస్టు 7, 8 తేదీల్లో TCA స్వర్ణోత్సవ మహాసభలు.
TCA: అమెరికాలోని ప్రముఖ ప్రవాస తెలుగు సంస్థ ‘హ్యూస్టన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్‘ (TCA) ప్రతిష్టాత్మక స్వర్ణోత్సవ మహాసభల (Golden Jubilee Celebrations 2026) ఏర్పాట్లు అత్యంత వేగంగా, ఘనంగా కొనసాగుతున్నాయి. గత 50 ఏళ్ల తెలుగు ఐక్యత, అచంచల సేవా ప్రస్థానానికి నిదర్శనంగా నిలిచేలా ఈ “స్వర్ణయుగ వేడుకలను” అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేస్తున్నారు.
30 కమిటీలు.. 150 మంది వాలంటీర్లు..
ఈ చారిత్రాత్మక వేడుకలను విజయవంతం చేసేందుకు సుమారు 30 ప్రత్యేక కమిటీలు, 150 మందికి పైగా వాలంటీర్లు గత మూడు నెలలుగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. మహాసభలకు విచ్చేసే ప్రతి ఒక్కరికీ ఒక మరపురాని, అద్భుతమైన అనుభూతిని అందించాలనే లక్ష్యంతో పక్కా ప్రణాళికలతో (Micro Planning) పనులను ముందుకు తీసుకెళ్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఈ మహాసభలకు టీసీఏ (TCA) అధ్యక్షులు యాదగిరి రెడ్డి, కన్వీనర్ జితేందర్ రెడ్డి సమర్థవంతమైన నాయకత్వం వహిస్తున్నారు. వారితో పాటు టీసీఏ కన్వెన్షన్ కోర్ టీమ్ సభ్యులు ముందుండి అన్ని కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నారు.

వేదిక , తేదీల వివరాలు..
వేదిక: ఫోర్ట్ బెండ్ ఎపికెంట్టర్ (Fort Bend Epicenter)
తేదీలు: ఆగస్టు 7 , 8, 2026 (రెండు రోజుల పాటు)
తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు, కరతాళ ధ్వనుల మధ్య సాగే సంగీతం, సాహిత్య చర్చలు, కనువిందు చేసే వినోద కార్యక్రమాలతో ఈ రెండు రోజుల వేడుకలు జరగనున్నాయి. “50 సంవత్సరాల సేవ… తెలుగు ఐక్యతకు స్వర్ణయుగ వేడుక!” అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ చారిత్రక స్వర్ణోత్సవాల్లో ప్రతీ తెలుగు కుటుంబం భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ తరలివచ్చి ఈ మహాసభలను విజయవంతం చేయాలని ‘టీసీఏ’ (TCA) కుటుంబం హృదయపూర్వక ఆహ్వానం పలుకుతోంది.
ఇవి కూడా చదవండి







