ఎబోలాపై ఆందోళన అవసరం లేదు : రాజనర్సింహ
ఎబోలా (Ebola)పై ఆందోళన అవసరం లేదని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarasimha) అన్నారు. ఆ వ్యాది విస్తృతి ఉన్న దేశాల నుంచి వచ్చేవారికి విమానాశ్రయంలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. గాంధీ ఆస్పత్రి (Gandhi Hospital)లో ప్రత్యేకంగా 10 పడకలతో ఐసోలేషన్ వార్డు సిద్ధం చేశాం. అనుమాతుల శాంపిళ్లను పరీక్షల కోసం పుణె (Pune) పంపుతాం. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వస్తే 21 రోజుల పాటు సెల్స్ ఐసోలేషన్ లో ఉండాలి. ఆ వ్యాధి విస్తృతి ఉన్న దేశాల నుంచి ఈ నెల 25 నాటికి 58 మంది వచ్చారు అని తెలిపారు.
ఇవి కూడా చదవండి







