దేవీశ్రీ ఎల్లమ్మను ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్
టాలీవుడ్లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలకు సంగీతం అందించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) ఇప్పుడు మరో కొత్త ప్రయాణానికి సిద్ధమయ్యారు. సంగీత దర్శకుడిగా దేశవ్యాప్తంగా అభిమానులను అలరించిన దేవిశ్రీ ప్రసాద్, ఇప్పుడు హీరోగా వెండితెరపై కనిపించబోతుండటం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. డైరెక్టర్ వేణు ఎల్దండి(Venu Yeldandi) తెరకెక్కిస్తున్న గ్రామీణ భక్తిరస ప్రధాన చిత్రం ఎల్లమ్మ ద్వారా ఆయన నటుడిగా పరిచయం కానుండటం విశేషం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
అయితే అనేక కథలు, చర్చల తర్వాత హీరోగా ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్న దేవిశ్రీ ప్రసాద్, చివరకు ఎల్లమ్మ సినిమానే ఎందుకు ఎంచుకున్నారనే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి సత్యమూర్తి జన్మస్థలం అయిన వెదురుపాక గ్రామంతో ఉన్న ఎమోషనల్ బాండింగే ఈ కథకు వెంటనే కనెక్ట్ అయ్యేలా చేసిందని వెల్లడించారు. ఆ ఊరి సంస్కృతి, సంప్రదాయాలు, గ్రామీణ జీవన శైలి తనను బలంగా ప్రభావితం చేశాయని, అదే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ప్రధాన కారణమని తెలిపారు. దీంతో ఈ సినిమా కేవలం ఓ కమర్షియల్ ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా, దేవిశ్రీకి వ్యక్తిగతంగా ఎంతో దగ్గరైన కథగా మారింది.
ఆల్రెడీ ఎల్లమ్మ నుంచి విడుదలైన గ్లింప్స్ కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. గ్రామీణ వాతావరణం, భక్తిరస ఎమోషన్స్, వేణు ఎల్దండి మార్క్ నేచురల్ టేకింగ్ గ్లింప్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ లుక్, ఆయన బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకుల్లో కొత్త ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ సినిమాకి ఆయనే సంగీతం కూడా అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) నిర్మాణ బాధ్యతలు చేపట్టడం సినిమాకు మరింత బలం చేకూరుస్తోంది.
ఇవి కూడా చదవండి







