26th May 2026

___________

- Saidulu

కమ్మగా నోరూరించే చుక్కకూర పచ్చడి రెసిపీ..

రోజూ ఒకే రకమైన కూరలు తింటూ బోర్ కొట్టేస్తే ఇంట్లోనే సింపుల్‌గా చుక్కకూర పచ్చడి చేసుకోవచ్చు. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడి తింటే అద్భుతమైన రుచి వస్తుంది.

చుక్కకూరలో లైట్ గా పులుపు ఉండటం వల్ల పచ్చడికి ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది. చాలా తక్కువ సమయంలోనే ఈ వంటకం రెడీ అవుతుంది.

ముందుగా చుక్కకూరను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోయాలి. తర్వాత కొద్దిగా నూనెలో వేయించి పక్కన పెట్టాలి.

అదే పాన్‌లో మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించి చల్లారనివ్వాలి. ఇవే పచ్చడికి మంచి వాసన తీసుకొస్తాయి.

వేయించిన పదార్థాలను మిక్సీలో వేసి కొద్దిగా ఉప్పుతో గ్రైండ్ చేయాలి. తర్వాత చుక్కకూరను కూడా వేసి మెత్తగా చేసుకోవాలి. మిక్సీ వద్దు అనుకుంటే ఈ పచ్చడి రోట్లో కూడా రుబ్బుకోవచ్చు.

పచ్చడికి వెల్లుల్లి రెబ్బలు కలిపితే రుచి మరింత పెరుగుతుంది. కారాన్ని తమ రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు.

చివరగా ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చితో తాలింపు పెట్టి పచ్చడిలో కలపాలి. దీంతో రుచి మరింత అద్భుతంగా మారుతుంది.

ఈ చుక్కకూర పచ్చడి వేడి అన్నం, నెయ్యి, ఇడ్లీ, దోసెలతో కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో అందరూ ఇష్టంగా తినే రుచికరమైన వంటకం ఇది.