భారత్‌కు దిమ్మతిరిగే షాక్.. స్టాక్ మార్కెట్లో మనల్ని దాటేసిన ‘తైవాన్’..!
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృష్టిస్తున్న ప్రకంపనలు గ్లోబల్ స్టాక్ మార్కెట్ (Stock Market) ముఖచిత్రాన్నే మార్చేస్తున్నాయి. దలాల్ స్ట్రీట్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా సగర్వంగా వెలుగొందుతున్న భారత్‌ను.. ఒక చిన్న దేశమైన తైవాన్ వెనక్కి నెట్టేసింది. ఈ ఊహించని దెబ్బతో అమెరికా, చైనా, జపాన్, హాంకాంగ్‌ల తర్వాత ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఈక్విటీ మార్కెట్‌గా తైవాన్ అవతరించి సంచలనం సృష్టించింది.
ఆ ఒక్క కంపెనీ వల్లనే!
తాజా అంచనాల ప్రకారం తైవాన్ స్టాక్ మార్కెట్ (Stock Market) విలువ 4.95 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగా, భారత మార్కెట్ విలువ 4.92 ట్రిలియన్ డాలర్ల వద్ద నిలిచి ఆరో స్థానానికి పడిపోయింది. తైవాన్ మనల్ని ఇలా ఒక్కసారిగా దాటేయడం వెనుక ఉన్న అసలు బలం.. ‘ఏఐ’ (AI). కృత్రిమ మేధకు అవసరమైన అత్యాధునిక హార్డ్‌వేర్, చిప్‌లను తయారు చేయడంలో ప్రపంచంలోనే రారాజుగా ఉన్న ‘తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ’ (TSMC) ఈ అద్భుతాన్ని సుసాధ్యం చేసింది.
ఇవి కూడా చదవండి
ఒక్క టీఎస్ఎంసీ షేర్ల దూకుడుకే మార్కెట్ (Stock Market) లెక్కలు మారిపోయాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ఆ కంపెనీ షేర్లు ఏకంగా 49 శాతం లాభాలను కురిపించాయి. తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీలో ఏకంగా 42 శాతం వాటా ఈ ఒక్క కంపెనీదే కావడం విశేషం. దీనికి తోడు దేశీయ ఫండ్స్ పెట్టుబడి పరిమితులను తైవాన్ ప్రభుత్వం సడలించడం కూడా అక్కడి మార్కెట్ బూమ్‌కు కలిసొచ్చింది.
మన మార్కెట్ ఎందుకు చతికిలబడింది?
ప్రపంచమంతా ఏఐ జపంతో పరుగులు పెడుతుంటే, భారత్‌లో ఆ రంగంలో ప్రత్యక్షంగా సత్తా చాటే బలమైన టెక్ కంపెనీలు (డైరెక్ట్ ఏఐ ప్లేయర్స్) స్టాక్ మార్కెట్లో (Stock Market) లేకపోవడం మనకు పెద్ద మైనస్‌గా మారింది. దీనికి తోడు అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, మందగించిన కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు వంటి కారణాలతో దేశీయ స్టాక్ మార్కెట్ గత కొంతకాలంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ ప్రతికూల పవనాలే మన మార్కెట్ వృద్ధిని నెమ్మదించేలా చేశాయి.
భయపడాల్సిన పనిలేదు..
స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (విలువ) పరంగా తైవాన్ మనకంటే ఒక అడుగు ముందుకు వేసినప్పటికీ.. ఇక్కడ గమనించాల్సిన మరో కీలక వాస్తవం ఉంది. వాస్తవ ఆర్థిక సామర్థ్యం, స్థూల దేశీయోత్పత్తి (GDP) లెక్కల్లో చూసుకుంటే మాత్రం తైవాన్ కంటే భారతదేశమే ఎంతో పటిష్టంగా, మెరుగైన స్థానంలో ఉందని ఆర్థిక నిపుణులు భరోసా ఇస్తున్నారు. తాత్కాలికంగా ఈక్విటీ మార్కెట్ (Stock Market) విలువలో మార్పులు జరిగినా, భారత ఆర్థిక పునాదులు బలంగానే ఉన్నాయని, దీర్ఘకాలంలో మన వృద్ధిని ఎవరూ ఆపలేరని స్పష్టం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి







