కింగ్ లో ఆ బాలీవుడ్ స్టార్ క్యామియో?
బాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రణ్వీర్ సింగ్(Ranveer Singh) కెరీర్ ఇప్పుడు కొత్త మలుపు తిరిగినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ధురంధర్(Dhurandhar) సినిమా తర్వాత ఆయనకు భారీ ప్రాజెక్టుల క్యూ కడుతున్నాయనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే రణ్వీర్ మాత్రం తొందరపడి సినిమాలు ఒప్పుకోవడం లేదట. కథ, పాత్ర ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టులకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చాలా సెలెక్టివ్‌గా ముందుకెళ్తున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే నేపథ్యంలోనే డాన్3 ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకోవడం కూడా పెద్ద చర్చకు దారి తీసింది. ఆ విషయంపై ఇంకా క్లారిటీ రాకపోయినా, రణ్వీర్ తదుపరి అడుగులపై మాత్రం భారీ ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి
ఇలాంటి సమయంలో ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్(Shah Rukh Khan) నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ కింగ్ సినిమాలో రణ్వీర్ సింగ్ ఓ కీలక గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం. చిన్న నిడివి ఉన్న పాత్ర అయినప్పటికీ కథలో టర్నింగ్ పాయింట్లా ఉంటుందని టాక్. ఇటీవల యూరప్‌లో జరిగిన షూటింగ్ షెడ్యూల్లో రణ్వీర్ తన భాగానికి సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ ట్రిప్‌కు దీపికా పదుకొణె(Deepika Padukone) కూడా ఆయనతో కలిసి వెళ్లినట్టు బాలీవుడ్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.
సిద్ధార్థ్ ఆనంద్(Siddhardh Anand) దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్(King) మూవీపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. షారుఖ్ ఖాన్‌తో పాటు సుహానా ఖాన్(Suhana Khan), అభిషేక్ బచ్చన్(Abhishek Bachan) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పుడు రణ్వీర్ సింగ్ క్యామియో వార్త బయటకు రావడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది.
ఇవి కూడా చదవండి







