కార్తీ సినిమాలో మీనూ!
తమిళ స్టార్ హీరో కార్తీ(Karthi) కొత్త ప్రాజెక్ట్‌తో మరోసారి సౌత్ సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్స్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్(Kalyan Shankar) దర్శకత్వంలో కార్తీ ఓ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇటీవల ఘనంగా పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది.
ఇవి కూడా చదవండి
ఈ సినిమాలో కార్తీ సరసన మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హీరోయిన్గా నటిస్తోంది. ఈ ఫ్రెష్ జోడీపై ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి బజ్ నెలకొంది. ముఖ్యంగా మ్యాడ్(MAD), మ్యాడ్ స్వ్కేర్(MAD Square) వంటి యూత్‌ఫుల్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో కార్తీ కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. వినోదంతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, కలర్‌ఫుల్ క్యారెక్టర్స్, యూత్‌కు కనెక్ట్ అయ్యే అంశాలతో డైరెక్టర్ ఈ సినిమాను డిజైన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల వాతి(Vaathi), లక్కీ భాస్కర్(Lucky Baskhar) సినిమాలతో వేరే ఇండస్ట్రీ హీరోలతో సూపర్ హిట్లు అందుకున్న సితార బ్యానర్, ప్రస్తుతం సూర్యతో విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath & Sons) వంటి ప్రాజెక్ట్‌ను రూపొందిస్తూనే, కార్తీ సినిమాను కూడా అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించనున్నట్లు సమాచారం. కార్తీకి ఉన్న నేచురల్ కామెడీ టైమింగ్, కళ్యాణ్ శంకర్ ఎనర్జిటిక్ నెరేషన్ కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెడతాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇవి కూడా చదవండి







