తెలుగు డైరెక్టర్ కోలీవుడ్ స్టార్ హీరో సినిమా
తమిళ స్టార్ హీరో కార్తీ(Karthi) ఎట్టకేలకు స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. చాలా ఏళ్లుగా తెలుగు డైరెక్టర్లతో కథలు వింటూ సరైన ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్న కార్తీ, ఇప్పుడు యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్(Kalyan Shankar) చెప్పిన ఎంటర్టైనర్కు ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాను అధికారికంగా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించగా, సినీ ప్రముఖులు హాజరై టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాపై మొదటి నుంచే మంచి బజ్ ఏర్పడింది.
మ్యాడ్(MAD), మ్యాడ్ స్వ్కేర్(MAD Square) సినిమాలతో యూత్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ శంకర్ ఈ సినిమాను పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హీరోయిన్గా మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) ఎంపిక కావడం కూడా సినిమాపై అంచనాలను పెంచింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, కార్తీ ప్రస్తుతం చేస్తున్న కమిట్మెంట్స్ పూర్తయ్యాక ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం.
ఇటీవల విడుదలైన వా వాతియార్(Vaa Vaathiyaar) ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో కార్తీకి బలమైన హిట్ అవసరమైంది. ప్రస్తుతం ఆయన సర్దార్2(Sardar2), మార్షల్(Marshal) సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. మరోవైపు చాలా కాలంగా చర్చల్లో ఉన్న ఖైదీ2(Kaithi2) ప్రాజెక్ట్‌పైనా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో తెలుగు మార్కెట్‌ను మరింత బలోపేతం చేసే స్ట్రెయిట్ తెలుగు సినిమాతో కార్తీ ముందుకు రావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి







