మే 30న అట్లాంటాలో ఘనంగా ‘గేట్స్’ తెలంగాణ సాంస్కృతిక దినోత్సవం
అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఉన్న ప్రవాస తెలంగాణ ప్రజల ప్రముఖ సంస్థ ‘గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ‘ (GATeS) మన చారిత్రాత్మక వారసత్వం, సంప్రదాయాలు సమాజ స్ఫూర్తిని చాటిచెప్పేందుకు సిద్ధమైంది. సేవ-సంస్కృతి అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఈ సంస్థ, ప్రతిష్టాత్మక ‘తెలంగాణ సాంస్కృతిక దినోత్సవం 2026′(Telangana Cultural Day 2026) వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనుంది. అల్ఫారెక్టా నగరంలో 2026 మే 30వ తేదీ శనివారం నాడు ఈ చారిత్రక సంబరాలు అట్టహాసంగా జరగనున్నాయి.
సాంస్కృతిక దినోత్సవం ప్రధాన వివరాలు:
తేదీ: మే 30, 2026 (శనివారం)
సమయం: మధ్యాహ్నం 12:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు
వేదిక: డెన్మార్క్ హై స్కూల్ (Denmark High School), 645 ముల్లినాక్స్ రోడ్ (Mullinax Rd), అల్ఫారెక్టా, జార్జియా (GA 30004), అమెరికా.
ఇవి కూడా చదవండి
ముఖ్య అతిథి…
తెలంగాణ ధూం ధాం వేదికల ద్వారా సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేసిన ప్రముఖ కళాకారుడు, తెలంగాణ సాంస్కృతిక సారథి ప్రథమ చైర్మన్ రసమయి బాలకిషన్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా (Chief Guest) విచ్చేయనున్నారు. వీరితో పాటు ప్రవాస భారతీయులను అలరించేందుకు పలువురు ప్రముఖ గాయకులు ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు:
స్వాతి రెడ్డి: ప్రముఖ నేపథ్య గాయని (Playback Singer)
జనార్ధన్ పన్నెల: ప్రముఖ జానపద గాయకుడు (Folk Singer)
సృష్టి చిల్లా: ప్రముఖ గాయని (Singer)
యువతను ఉర్రూతలూగించేందుకు ‘స్ట్రింగ్స్ లైవ్ బ్యాండ్’ (STRINGZ LIVE BAND) వారిచే ప్రత్యేక సంగీత విభావరి ఏర్పాటు చేశారు.
ప్రవేశం, రిజిస్ట్రేషన్ వివరాలు:
ఈ సాంస్కృతిక సంబరాలలో పాల్గొనడానికి గేట్స్ (GATeS) సభ్యులకు ప్రవేశం పూర్తిగా ఉచితం (FREE). సభ్యులు కాని వారికి ప్రవేశ రుసుము 10 డాలర్లుగా నిర్ణయించారు. ఈవెంట్లో పాల్గొనదలచే వారు అధికారిక ఆన్లైన్ లింక్ tinyurl.com/GATeSEventRegistration ద్వారా లేదా పోస్టర్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. వ్యాపార ప్రకటనలు, ప్రదర్శనల కోసం వెండర్ స్టాల్స్ (Vendor Stalls) కూడా అందుబాటులో ఉన్నాయి, ఆసక్తి గల వారు tinyurl.com/vendorStall లింక్ ద్వారా స్టాళ్లను బుక్ చేసుకోవచ్చు.
కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం కింది ప్రతినిధులను సంప్రదించవచ్చు:
శరత్ గండ్ర: +1 (404) 216-6423
జ్యోత్స్న పాలకుర్తి: +1 (314) 420-6084
మధుకర్ రెడ్డి పటేల్: +1 (832) 525-8965
చంద్రశేఖర్: +1 (404) 353-8812
అనిల్ కుష్ణపల్లి: +1 (510) 676-7922
రఘువీర్ రెడ్డి: +1 (848) 565-5096
కీర్తిధర్ గౌడ్ చెక్కిళ్ళ: +1 (904) 343-3105
రమణ గండ్ర: +1 (415) 328-6229
ఈ వేడుకలను గేట్స్ అధ్యక్షుడు రమణ గండ్ర, బోర్డ్ చైర్మన్ జ్యోత్స్న పాలకుర్తి, వైస్ ప్రెసిడెంట్ కీర్తిధర్ గౌడ్ చెక్కిళ్ళ, జనరల్ సెక్రటరీ రఘువీర్ రెడ్డి, ట్రెజరర్ రామకృష్ణ గండ్రల పర్యవేక్షణలో.. ఎగ్జిక్యూటివ్ కమిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులతో కూడిన ‘గేట్స్ టీమ్ 2026’ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అట్లాంటా పరిసర ప్రాంతాల్లోని తెలంగాణ కుటుంబాలంతా పెద్ద సంఖ్యలో హాజరై ఈ సాంస్కృతిక జాతరను విజయవంతం చేయాలని నిర్వాహక బృందం కోరింది.







