చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో అండర్ ఆర్మ్ నల్లదనం కూడా ఒకటి. స్లీవ్‌లెస్ దుస్తులు ధరించాలన్నా, బయటకు వెళ్లాలన్నా ఈ సమస్య కారణంగా చాలామంది అసౌకర్యంగా ఫీలవుతుంటారు.
ఆ మంది అండర్ ఆర్మ్స్ డార్క్నెస్ పోవడానికి కెమికల్స్ తో నిండిన బ్లీచ్ వంటివి వాడుతారు. అయితే వీటి వల్ల స్కిన్ బాగా డామేజ్ అవుతుంది.
అండర్ ఆర్మ్స్ నల్లబడటానికి చెమట, డెడ్ స్కిన్, తరచుగా షేవింగ్ చేయడం, కెమికల్స్ ఉన్న డియోడరెంట్లు వాడటం ముఖ్య కారణాలు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను ఇంట్లోనే తగ్గించుకోవచ్చు.
నిమ్మరసం సహజ బ్లీచింగ్‌లా పనిచేస్తుంది. కొద్దిగా నిమ్మరసం తీసుకుని అండర్ ఆర్మ్స్‌పై రాసి 10 నిమిషాల తర్వాత కడిగేస్తే మెల్లగా నల్లదనం తగ్గుతుంది.
బంగాళాదుంప రసం కూడా చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. బంగాళాదుంప ముక్కను నేరుగా రుద్దినా లేదా రసం రాసినా మంచి ఫలితం కనిపిస్తుంది.
బేకింగ్ సోడా, నీటితో పేస్ట్ చేసి వారానికి రెండు సార్లు స్క్రబ్‌లా వాడితే డెడ్ స్కిన్ తొలగిపోతుంది. దీంతో చర్మం శుభ్రంగా, మృదువుగా మారుతుంది.
అలోవెరా జెల్ చర్మానికి చల్లదనంతో పాటు సహజ కాంతిని ఇస్తుంది. ప్రతిరోజూ రాత్రి అలోవెరా జెల్ రాసి కొద్దిసేపటి తర్వాత కడిగితే మంచి మార్పు కనిపిస్తుంది.
కొబ్బరి నూనెలో ఉండే విటమిన్-ఇ చర్మానికి సహజ పోషణ అందిస్తుంది. రోజూ కొద్దిగా కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే చర్మం మృదువుగా మారి నల్లదనం తగ్గేందుకు సహాయపడుతుంది.
చాలా టైట్ దుస్తులు ధరించడం వల్ల కూడా చర్మంపై రాపిడి పెరిగి నల్లదనం రావచ్చు. కాబట్టి కాస్త వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం మంచిది