లండన్‌లో టీపీఎల్ క్రికెట్ సమరం షురూ.. ఆగస్టు 16న ఫైనల్ పోరు
TPL Cricket: యునైటెడ్ కింగ్‌డమ్‌లోని తెలుగు సమాజానికి క్రీడా ఉత్సాహాన్ని అందిస్తూ, తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) తన ప్రతిష్టాత్మక TAL ప్రీమియర్ లీగ్ (TPL) 2026 17వ ఎడిషన్‌ను ఘనంగా ప్రారంభించింది. మే 16న లండన్‌లోని గ్రీన్‌ఫోర్డ్ ప్రాంతంలో ఉన్న ఈలింగ్ హాన్వెలియన్స్ క్రికెట్ మైదానంలో ఈ క్రీడా సంబరం మొదలైంది. 2009లో చిన్నగా ప్రారంభమైన ఈ టోర్నమెంట్, ఇప్పుడు బ్రిటన్‌లోని తెలుగు వారిని క్రికెట్ , సామాజిక స్పూర్తితో ఏకం చేసే అతిపెద్ద వేదికగా ఎదిగింది.
15 వారాల పాటు హోరాహోరీ పోరు..
ఈ సంవత్సరం టోర్నమెంట్లో మొత్తం 10 జట్లు తలపడుతున్నాయి. రాబోయే 15 వారాల పాటు లీగ్ మ్యాచ్‌లు, నాకౌట్ రౌండ్లు, క్వార్టర్ ఫైనల్స్ , సెమీ ఫైనల్స్ నిర్వహించనున్నారు. ఈ క్రీడా పోరుకు ముగింపుగా ఆగస్టు 16న స్లౌ క్రికెట్ క్లబ్లో గ్రాండ్ ఫైనల్ నిర్వహింస్తున్నారు. ప్రారంభోత్సవంలో TAL ఛైర్మన్ రవి సబ్బా మాట్లాడుతూ.. తెలుగు ప్రజలను ఒక్కటిగా చేర్చడంలో TAL ఎప్పుడూ ముందుంటుందని, జట్లన్నింటికీ తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

నిర్వాహకులకు అభినందనలు..
ఈ టోర్నమెంట్ విజయవంతం కావడానికి కృషి చేసిన ట్రస్టీ సత్య పెద్ది రెడ్డి, స్పోర్ట్స్ ఇన్చార్జ్ సింధూర చెరుకు , వాలంటీర్లకు ఛైర్మన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీ బోర్డు సభ్యులు అశోక్ మధిశెట్టి, వెంకట్ నీలా, రవి మొచెర్ల, అనిల్ అనంతుల, కిరణ్ కప్పేట తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యం కోసం ‘1 మిలియన్ అడుగులు’ ఛాలెంజ్..
క్రికెట్‌తో పాటు సమాజ శ్రేయస్సు కోసం TAL “100 రోజులలో 1 మిలియన్ అడుగులు ఛాలెంజ్” అనే వినూత్న ఫండ్‌రైజింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఫిట్నెస్ను మెరుగుపరుచుకుంటూనే సమాజ సేవకు నిధులు సేకరించడం దీని ఉద్దేశ్యం. వెంకట్ తోటకూర, శ్రీహరి అరిగే, సునీత అరిగే , సింధూర చెరుకు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నారు. తమ వినూత్న కార్యక్రమాల ద్వారా యుకేలోని తెలుగు కుటుంబాల మధ్య ఐక్యతను, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి TAL నిరంతరం కృషి చేస్తోంది.
ఇవి కూడా చదవండి







