జూలై 25న షార్లెట్‌లో TAGCA వాలీబాల్ & త్రోబాల్ టోర్నమెంట్
TAGCA: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షార్లెట్ ఏరియా (TAGCA) కమ్యూనిటీ స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో జూలై 25, 2026న భారీ ఎత్తున వాలీబాల్ , త్రోబాల్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తోంది. “కలిసి ఆడదాం – కలిసి ఎదుగుదాం” అనే నినాదంతో ఇండియన్ ట్రైల్‌లోని ‘కరోలినా కోర్ట్స్’ వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి
కార్యక్రమ వివరాలు..
శనివారం ఉదయం 7:00 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలో క్రీడలతో పాటు వినోద కార్యక్రమాలు, డీజే, పిల్లల కోసం ప్రత్యేక ఆటలు , రుచికరమైన భారతీయ భోజన వసతి ఏర్పాటు చేశారు.
రిజిస్ట్రేషన్ వివరాలు..
జట్టు రిజిస్ట్రేషన్ ఫీజు $250 కాగా, ప్రతి టీమ్‌లో గరిష్టంగా 10 మంది సభ్యులకు అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాలకు , రిజిస్ట్రేషన్ కోసం ఈ క్రింది ప్రతినిధులను సంప్రదించవచ్చు.
- రఘు అల్లూరి (Raghu Alluri): +1 (803) 984-1316
- శశి మజ్జి (Shashi Majji): +1 (704) 493-2328
- కల్యాణి చలసాని (Kalyani Chalasani): +1 (704) 671-8044
షార్లెట్ పరిసర ప్రాంతాల్లోని తెలుగు వారందరూ ఈ క్రీడా పండుగలో పాల్గొని దిగ్విజయం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి






