నీట్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి : సీఎం రేవంత్ రెడ్డి
విద్యార్థుల భవిష్యత్తును నీట్ (NEET) పేపర్ లీక్ ఘటన నిర్వీర్యం చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. నీట్ రద్దు లక్షలాది విద్యార్థులు (Students), తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగించిందని తెలిపారు. జాతీయ పరీక్షల విశ్వసనీయతను అన్నివిధాలా కాపాడాలన్నారు. పేపర్ లీక్‌లు (Paper Leaks), అవినీతికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభావితమైన విద్యార్థులు, తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. పారదర్శక, కాలపరిమితితో కూడిన విచారణ జరపాలని కేంద్రాన్ని కోరుతున్నామని తెలిపారు. ఘటనలు పునరావృతం కాకుండా జవాబుదారీతనం ఉండాలన్నారు.






