బ్రౌన్ డ్రెస్ లో ప్రగ్యా అందాల విందు
మొదటి సినిమాతోనే కుర్రాళ్ల గుండెలకు కంచె(Kanche) వేసిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అప్పుడప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా ప్రగ్యా చాక్లెట్ బ్రౌన్ కోచర్ డ్రెస్ ను ధరించింది. ఈ డ్రెస్ లో ప్రగ్యా అందాలు ఎంతో బాగా ఎలివేట్ అవగా, ఆ డ్రెస్ కు హై సైడ్ స్లిట్ ఉండటంతో ప్రగ్యా మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది. ఈ ఫోటోలను చూసి నెటిజన్లు ఆమె అందానికి ఫిదా అవుతూ సోషల్ మీడియాలో వాటిని తెగ షేర్ చేస్తున్నారు.






