గోల్డ్ కలర్ డ్రెస్ లో ప్రగ్యా అందాల ఆరబోత
టాలీవుడ్ భామ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) తన అందం, గ్లామర్ తో యూత్ ను ఆకట్టుకుంటూ ఉంటుంది. కంచె(Kanche) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రగ్యా, ఆ తర్వాత బాలయ్య(Balayya)తో అఖండ(Akhanda) లాంటి భారీ బ్లాక్ బస్టర్ ను అందుకుంది. అఖండ తర్వాత ప్రగ్యా బిజీ అవుతుందనుకుంటే ఆమె మాత్రం ఛాన్సులను దక్కించుకోవడంలో తడబడుతోంది. అయితే ప్రగ్యా కెరీర్ సినిమాల పరంగా ఎలా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను అందిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా గోల్డ్ కలర్ అవుట్‌ఫిట్ లో తన అందాలను ఒలకబోస్తూ ఫోటోలకు పోజులివ్వగా, ఈ ఫోటోల్లో ప్రగ్యా మరింత అందంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ వాటిని నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.






