జూలై 17-19న టీటీఏ మహాసభలు.. మెగా స్పాన్సర్‌గా ‘రాజపుష్ప ప్రాపర్టీస్
TTA: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ఆధ్వర్యంలో జూలై నెలలో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక “టీటీఏ మెగా కన్వెన్షన్ 2026″ కు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ‘రాజపుష్ప ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్’ మెగా స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈ మేరకు టీటీఏ నిర్వాహకులు రాజపుష్ప ప్రాపర్టీస్ సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
వివరాలు..
ఈ మెగా కన్వెన్షన్ 2026, జూలై 17 నుండి 19 వరకు నార్త్ కరోలినాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో అత్యంత వైభవంగా జరగనుంది.
నిర్వహణ బృందం..
టీటీఏ అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది నేతృత్వంలో కన్వీనర్ ప్రవీణ్ చింత, కోఆర్డినేటర్లు నరేన్ దేవరాపల్లి, శేఖర్ రెడ్డి కుంటియల్లానగరి ఈ మహాసభల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
కార్యవర్గ కమిటీ ..
గణేష్ వీరమనేని (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్), శివ రెడ్డి కొల్లా (జనరల్ సెక్రటరీ), సహోదర్ రెడ్డి పెద్దిరెడ్డి (ట్రెజరర్), కవిత రెడ్డి (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) , ఇతర సభ్యులు ఈ వేడుకను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. అలాగే ఫౌండర్ డాక్టర్ పాళ్ల మల్లారెడ్డి, చైర్మన్ డాక్టర్ విజయపాల్ రెడ్డి ఆధ్వర్యంలోని అడ్వైజరీ కమిటీ మార్గనిర్దేశం చేస్తోంది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే ఈ మహాసభలకు భారీ సంఖ్యలో తెలుగువారు హాజరుకావాలని టీటీఏ ప్రతినిధులు కోరుతున్నారు. మరిన్ని వివరాల కోసం www.ttaconvention.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఇవి కూడా చదవండి






