అటుకులు, బెల్లం, డ్రై ఫ్రూట్స్‌తో చేసే ఈ లడ్డూలో శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు, ఫైబర్ లభిస్తాయి.
మందపాటి అటుకులు, బెల్లం, నెయ్యి, యాలకుల పొడి, జీడిపప్పు, బాదం, వేరుశెనగలు, నువ్వులు సిద్ధంగా ఉంచుకోండి.
అటుకులను తక్కువ మంటపై స్వల్పంగా వేయించండి. ఇలా చేస్తే మంచి సువాసనతో పాటు లడ్డూ రుచి మరింత పెరుగుతుంది.
బెల్లాన్ని కొద్దిగా నీటితో కరిగించి వడకట్టి, చిక్కగా అయ్యే వరకు మరిగించండి. దీంతో లడ్డూలు బాగా గట్టిపడతాయి.
వేయించిన అటుకులు, డ్రై ఫ్రూట్స్, నువ్వులు, యాలకుల పొడిని బెల్లం పాకంలో వేసి బాగా కలపండి.
మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకు నెయ్యి రాసుకుని గుండ్రంగా లడ్డూలు చేసుకోండి. చల్లారితే ఆకారం ఇవ్వడం కష్టం.
ఈ లడ్డూలు శక్తిని అందించడంతో పాటు ఫైబర్, ఐరన్, మంచి కొవ్వులు కూడా అందిస్తాయి. అయితే మితంగా తీసుకోవడం మంచిది.
లడ్డూలను పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే కొన్ని రోజుల పాటు తాజాగా ఉంటాయి.