తానా ఛార్లెట్ నాయకుల దాతృత్వం… పైన్విల్ చర్చికి నిత్యావసరాల పంపిణీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఛార్లెట్ విభాగం ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు కమ్యూనిటీతోపాటు, అమెరికా కమ్యూనిటీకి కూడా తానా నాయకులు సేవలను అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఛార్లెట్ లోని తానా నాయకులు పైన్ విల్ లోని చర్చికి ఫుడ్ డొనేషన్ చేశారు. తానా నాయకులు అంతా కలిసికట్టుగా 75 బ్యాగుల నిత్యావసర సరుకులను, అలాగే 400 ఫుడ్ కాన్స్ ను విరాళంగా సేకరించి అందించింది. ఈ సందర్భంగా చర్చి నిర్వాహకులు తానా నాయకులకు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఉదారమైన విరాళం ఎంతోమంది పేద కుటుంబాల ఆకలి తీర్చడానికి సహాయపడుతుందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతం చేసిన ఛార్లెట్ లోని తానా బృందాన్ని తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, ఇవిపి శ్రీనివాస లావు తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా ఛార్లెట్ లోని తానా నాయకులు మాట్లాడుతూ, ఈ కార్యక్రమ విజయవంతానికి సహకరించినప్రతి ఒక్క దాతకు, వాలంటీర్కు మరియు శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమాన్ని నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, రవి (నాని) వడ్లముడి, మాధురి ఏలూరి, కిరణ్ కొత్తపల్లి ఆధ్వర్యంలో జరిపారు.









