ఐర్లాండ్ చేతిలో ఓడినా.. ఇంగ్లాండ్ లో సత్తా చాటుతాం..!
భారత క్రికెట్ జట్టు వైట్-బాల్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) తన కెరీర్లో ఘోర ఓటమి అయిన.. ఐర్లాండ్ తో సీరీస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పూర్తిస్థాయి టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి సిరీస్‌లోనే భారత్.. ఐర్లాండ్ చేతిలో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో ఘోరంగా ఓడిపోయింది టీం ఇండియా. జూన్ చివరి వారంలో బెల్ఫాస్ట్లో జరిగిన ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోవడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ ఘోర పరాజయంపై స్పందించిన అయ్యర్.. ఐర్లాండ్ సిరీస్ ఓటమి తమను తీవ్రమైన డిప్రెషన్ లోకి నెట్టేసిందని సంచలన ప్రకటన చేశాడు.
ఐర్లాండ్ జట్టు అన్ని విభాగాల్లోనూ భారత్‌ను అవుట్‌ప్లే చేసిందని శ్రేయస్ అయ్యర్ అంగీకరించాడు. అయితే ఓటమికి పిచ్ పరిస్థితులు, గ్రౌండ్ కొలతలను సరిగ్గా అంచనా వేయలేకపోవడమే ప్రధాన కారణమని పేర్కొన్నాడు. బెల్ఫాస్ట్లోని స్టార్మాంట్ గ్రౌండ్ ఒక పక్కా ఇంటర్నేషనల్ స్టేడియంలా ఉండదని, అక్కడి అవుట్‌ఫీల్డ్ చాలా స్లోగా, ఎగుడుదిగుడుగా ఉందని పేర్కొన్నాడు. తామంతా ఐపీఎల్ (IPL 2026) లో పర్ఫెక్ట్ డైమెన్షన్స్ ఉన్న మైదానాల్లో ఆడి ఒక్కసారిగా ఇలాంటి అవుట్లాండిష్ గ్రౌండ్లో ఆడాల్సి వచ్చేసరికి ఫీల్డింగ్ సెట్ చేయడం కెప్టెన్‌గా తనకు కూడా ఒక పెద్ద సవాలుగా మారిందని అయ్యర్ చెప్పుకొచ్చాడు.
ఐర్లాండ్ సిరీస్ ఓటమి ఒక చేదు జ్ఞాపకమే అయినప్పటికీ, తాము దాని నుండి ఎంతో నేర్చుకున్నామని కెప్టెన్ అయ్యర్ వెల్లడించాడు. జులై 1 నుండి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కాబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ తమకు ఒక సరికొత్త చాప్టర్ అని ధీమా వ్యక్తం చేశాడు. ఇక్కడి వాతావరణం, మైదానాలపై తమ జట్టులోని సీనియర్లకు పూర్తి అవగాహన ఉందని, ఈ సిరీస్‌లో ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తామని పేర్కొన్నాడు. అలాగే ఐర్లాండ్ టూర్లో తన వ్యక్తిగత ఫామ్ సరిగ్గా లేనప్పటికీ.. ప్రెజర్ సిట్యువేషన్స్‌లో తాను ఎంత బాగా ఆడగలనో తనకు తెలుసని, నెట్స్‌లో బంతిని అద్భుతంగా టైమింగ్ చేస్తున్నానని శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశాడు.








