కేంద్రమంత్రి బండి సంజయ్‌కు భారీ ఊరట
కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ (Bandi Sanjay)కు నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంలో పెద్ద ఊరట లభించింది. గతంలో హుజూరాబాద్ |(Huzurabad) ఉప ఎన్నికల ప్రచార సమయంలో ఆయనపై నమోదైన ఒక పాత క్రిమినల్ కేసును కోర్టు (Court) పూర్తిగా కొట్టివేసింది. ఈ కేసుపై సుదీర్ఘంగా సాగిన విచారణ అనంతరం న్యాయస్థానం ఈ కీలక తీర్పును వెలువరించింది.
హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా అప్పటి అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీ ఓటుకు రూ.25 వేల వరకు ఇస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. అలాగే ఓటర్లకు రూ.5 వేల చొప్పున ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు పంచుకుంటున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యల నేపథ్యంలో హుజూరాబాద్ పోలీసులు బండి సంజయ్‌పై ఐపీసీ సెక్షన్లు 188, 171సీ, 505(2)తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 123(3ఏ) కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కేసును విచారించిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.








