సాయికృష్ణ కేసులో మరో ఇద్దరి అరెస్టు
సాయికృష్ణ (Saikrishna) కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణలంక క్రైమ్ కానిస్టేబుళ్లు ఏ5 బాబురావు ( Baburao), ఏ6 సాంబయ్య (Sambaiah)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరి పాత్రపై విచారించిన సిట్ (SIT) అధికారులు అరెస్టు చేశారు. నిందితులను విజయవాడ రెండో ఏసీఎం కోర్టులో హాజరుపర్చారు. కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం గన్నవరం జైలు (Gannavaram Jail) కు నిందితులను తరలించారు.








