జూలై 2 నుండి ఎన్నారైవిఎ మహాసభలు
అమెరికాలో ఉన్న వాసవీయులను ఒకే వేదికపైకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఏర్పడిన ఎన్నారై వాసవీ అసోసియేషన్ తన 8వ అంతర్జాతీయ మహాసభల నిర్వహణకు ఏర్పాట్లనుపూర్తి చేసింది. మాసాచుసెట్స్‌లోని స్ప్రింగ్ఫీల్డ్ నగరంలో ఉన్న ప్రతిష్టాత్మక ‘మాస్‌మ్యూచువల్ సెంటర్’ వేదికగా ఈ మహాసభలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. 2026 జూలై 2 నుండి జూలై 5 వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ మహాసభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. జూలై 3వ తేదీన జరిగే బాంక్వెట్ నైట్ లో సప్త తాండవం పేరుతో నృత్యరూపకాన్ని ఏర్పాటు చేశారు .నలిన్ దొడ్డనారి దీనికి సంగీతాన్ని అందించారు. గురువు శ్రీమతి ఆదిలక్ష్మీ గొల్లపూడి కొరియోగ్రఫీ చేశారు. జూలై 4 శనివారంనాడు ఎన్నారై విఎ ఛాప్టర్ల పెరేడ్ జరుగుతుంది. తరువాత శతమానం భవతి పేరుతో తల్లితండ్రులను గౌరవించుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ‘రాక్స్టార’ దేవిశ్రీ ప్రసాద్ లైవ్ కాన్సెర్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. జూలై 5 ఆదివారం ఉదయం 8 గంటలకు లోకకల్యాణార్థం శ్రీ స్వర్ణగిరి వేంకటేశ్వరస్వామి వారి వైభవోపేతమైన కల్యాణోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించ నున్నారు. వీటితోపాటు ఎన్నో సాంస్కృతిక ప్రదర్శనలు: అమెరికాలోని వివిధ చాప్టర్ల నుంచి తరలివచ్చే ప్రతిభావంతులైన వాసవీయులతో ‘వీ-గాట్ టాలెంట’, బ్యూటీ పేజెంట్, మరియు వైవిధ్యభరితమైన నృత్య, సంగీత ప్రదర్శనలు కూడా జరుగుతాయి.
సమాజ శ్రేయస్సు కోసం ‘బ్యాక్ టు స్కూల్ డ్రైవ’, ఫుడ్ డ్రైవ్, స్టెమ్ సెల్ డ్రైవ్ మరియు ఉచిత మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. బిజినెస్ అండ్ యూత్ కాన్ఫరెన్స్: వ్యాపారవేత్తల కోసం బిజినెస్ ఇంట్రెస్ట్ గ్రూప్ సెమినార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ప్రత్యేక సెషన్లు మరియు యువత కోసం యూత్ బ్యాంక్వెట్, లీడర్షిప్ టాక్స్ నిర్వహిస్తున్నారు. మ్యాట్రిమోని (పెళ్ళిచూపుల) సమన్వయ కార్యక్రమాలు కూడా ఈ కార్యక్రమాల్లో ఉన్నాయి.
ఎన్నారై విఎ అధ్యక్షుడు రమేష్ బాపనపల్లి, కన్వెన్షన్ కన్వీనర్ రమేష్ అమర్తులూరు, కో-కన్వీనర్ సురేష్ పొట్టి మరియు కన్వెన్షన్ కోఆర్డినేటర్లు శ్రీనివాసన్ విజయకుమార్, సౌమ్యలక్ష్మి సూర, కన్వెన్షన్ సెక్రటరీ శ్రీమతి లక్ష్మీ సంయుక్తంగా మాట్లాడుతూ… ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాసవీ కుటుంబ సభ్యులంతా ఈ మహాసభలకు తరలివచ్చి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని, ఈ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మరిన్ని వివరాలు మరియు రిజిస్ట్రేషన్ల కొరకు అధికారిక వెబ్సైట్ convention.nriva.org ను సందర్శించవచ్చు.
ముస్తాబవుతున్న స్ప్రింగ్ఫీల్డ్








