30th June 2026

__________

- Saidulu

6 నెలలైనా పాడవని టమాటా నిల్వ పచ్చడి… ఎలా చేయాలో తెలుసా?

అన్నంలోకి వేడి వేడి నెయ్యి, టమాటా నిల్వ పచ్చడి ఉంటే ఆ రుచే వేరు! లంచ్ బాక్స్ అయినా, పండగైనా ప్రతీ ఇంట్లో ఉండే ఆల్ టైమ్ ఫేవరెట్ ఇది.

పచ్చడి ఏడాది పాటు నిల్వ ఉండాలంటే గట్టిగా, పూర్తిగా ఎర్రగా పండిన నాటు టమాటాలను ఎంచుకోవాలి. అప్పుడే పచ్చడికి మంచి రంగు, రుచి వస్తాయి.

సరైన టమాటాల ఎంపిక

టమాటాలను శుభ్రంగా కడిగి, పొడి బట్టతో తుడిచి, ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. పచ్చడి తయారీలో ఎక్కడా ఒక్క చుక్క తడి కూడా తగలకూడదు.

తడి లేకుండా చూసుకోవాలి

కట్ చేసిన టమాటా ముక్కలను చింతపండు, పసుపు వేసి ఉడికించాలి. మూత తీసి ఉడికిస్తే ఆవిరి నీళ్లు పడకుండా ఉండి, పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.

ముక్కల ఉడికించడం

దోరగా వేయించిన ఆవాలు, మెంతులను చల్లార్చి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ ఆవ-మెంతుల పొడే టమాటా పచ్చడికి అసలైన సాంప్రదాయ సువాసన ఇస్తుంది.

సీక్రెట్ మసాలా పొడి

కేజీ టమాటాలకు 100గ్రా చింతపండు, అర కప్పు ఉప్పు, ఒక కప్పు కారం కచ్చితంగా వేయాలి. ఉప్పు, పులుపు తగ్గితే పచ్చడి త్వరగా బూజు పడుతుంది.

కొలతలు చాలా ముఖ్యం

ఉడికించిన టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారాకే కారం, ఉప్పు, మసాలా పొడి, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేయాలి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు చేయొద్దు.

గ్రైండింగ్ చిట్కా

పచ్చడికి నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె వాడితే రుచి అద్భుతంగా ఉంటుంది. ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఎక్కువ వెల్లుల్లితో పోపు పెట్టాలి.

 కమ్మని తాలింపు

తాలింపు చివర్లో కొద్దిగా ఇంగువ చేరిస్తే పచ్చడికి మంచి సువాసన రావడమే కాకుండా, అది సహజ ప్రిజర్వేటివ్‌గా పనిచేసి బూజు పట్టకుండా చూస్తుంది.

ఇంగువ ప్రాధాన్యత

తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాతే పచ్చడిలో కలపాలి. దీన్ని పొడిగా ఉన్న గాజు సీసా లేదా జాడీలో భద్రపరిస్తే ఏడాది పాటు ఫ్రెష్‌గా ఉంటుంది.

భద్రపరచడం ఎలా?