NRIVA: ఎన్నారై వాసవీ అసోసియేషన్ ఆధ్వర్యంలో దీపావళి సెలబ్రేషన్స్
ఎన్నారై వాసవి అసోసియేషన్ (NRIVA) కొలంబస్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘దీపావళి సెలబ్రేషన్స్ 2025’ (NRIVA Columbus Diwali 2025) ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒహాయోలోని కొలంబస్ వెస్ట్/హిలియార్డ్లోని కోర్ట్‌యార్డ్ బై మారియట్ వేదికగా డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. లక్ష్మీ హారతులు, సాంస్కృతిక కార్యక్రమాలు, రుచికరమైన విందు, డీజే వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ధర్మం, శీలం, అహింస అనే నినాదాలతో నిర్వహించబడుతున్న ఈ వేడుకల్లో (NRIVA Columbus Diwali 2025) పాల్గొనాలనుకునే కుటుంబాలు $80 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఎన్నారైవీఏ (NRIVA) కొలంబస్ చాప్టర్ నాయకత్వం ఉత్సాహంగా కృషి చేస్తోంది. చాప్టర్ అధ్యక్షులు రమేష్ బొప్పనపల్లి, అధ్యక్షులు ఎలక్ట్ ప్రవీణ్ తుడకమల్ల, జనరల్ సెక్రటరీ మహేష్ జెమొల్ల, కోశాధికారి సంతోష్ వెల్లూరి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు రమేష్ వర్ధ, ప్రాంతీయ డైరెక్టర్ చంద్ర బొజ్జవరపు ఈ వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చాప్టర్ లీడర్స్ అయిన కుందన్ రేవూరి, సరిత నందిమొట్ట, శ్రీనివాస్ కొండ ఈ వేడుకలను సమన్వయం చేస్తున్నారు. ఈ దీపావళి వేడుకలకు (NRIVA Columbus Diwali 2025) ఏజీ ఫిన్‌టెక్ (AG FinTech), బీబీఐ గ్రూప్ (BBI Group), ఎస్2టెక్ (S2Tech), ప్రాస్పర్ (PROSPER) తదితర సంస్థలు ప్లాటినం స్పాన్సర్స్‌గా సహకారం అందిస్తున్నాయి.






