Rohith Sharma: వన్డే కెరీర్ పైరోహిత్ సంచలన కామెంట్స్..!
టీం ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ.. వచ్చే ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్(World CUP) లో ఆడతాడా.. లేదా.. అనే దానికి సంబంధించి గత ఏడాదికాలంగా పెద్ద చర్చ జరుగుతోంది. గత ఏడాది టెస్టులకు గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మ.. ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. అయితే రోహిత్ శర్మ వయసు వచ్చే ఏడాదికి 40 ఏళ్లు దాటుతుంది. దీనితో అతను ప్రపంచకప్ లో పాల్గొంటాడా లేదా అనే దానిపై మాత్రం అభిమానుల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది.
ఇవి కూడా చదవండి
ఇక రోహిత్ శర్మను జట్టు నుంచి తప్పించేందుకు రాజకీయాలు జరుగుతున్నాయనే.. ఆరోపణలు కూడా ఈ మధ్యకాలంలో ప్రధానంగా వినిపించాయి. అటు విరాట్ కోహ్లీ(Virat Kohli) విషయంలో కూడా కాస్త సోషల్ మీడియాతో పాటుగా, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా హడావుడి జరిగింది. రోహిత్ శర్మని కెప్టెన్ గా తప్పించి ఆస్ట్రేలియా పర్యటన సమయంలో గిల్ కి కెప్టెన్ గా అవకాశం ఇవ్వటంపై అప్పట్లో ఆసక్తికర చర్చలు జరిగాయి. ఇక ఇప్పుడు రోహిత్ శర్మ వచ్చే ఏడాది జరగబోయే ప్రపంచ కప్ లో తాను ఆడబోతున్నానని స్పష్టం చేశాడు.
ఇవి కూడా చదవండి
తాను వన్డే క్రికెట్ చూసి క్రికెట్ నేర్చుకున్నానని, తనకు ప్రపంచ కప్ అంటే వన్డే వరల్డ్ కప్ మాత్రమేనని తెలిపాడు. అప్పట్లో టి20 ప్రపంచ కప్ గాని, ఐపీఎల్ గాని లేవని చెప్పుకొచ్చాడు. కప్పు కోసం ఎంతైనా సరే కష్టపడతానని.. రోహిత్ క్లారిటీ ఇచ్చేశాడు. ఫిట్నెస్ విషయంలో తాను దృష్టి పెట్టినట్లు రోహిత్ శర్మ వివరించాడు. ఎలాగైనా సరే ప్రపంచ కప్ గెలవాలనేది తన ఆశయంగా పేర్కొన్నాడు. రోహిత్ శర్మ ప్రస్తుతం ఫామ్ పరంగా కూడా రోహిత్ సీరియస్ గా ఫోకస్ పెట్టాడు.
ఇవి కూడా చదవండి













