YS Sharmila: జగన్ పై షర్మిల సంచలన కామెంట్స్..!
నెల్లూరు పర్యటనలో ఉన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. మునుబోలు మండలం అక్కంపేట గ్రామం వద్ద మన్రేగా పరిరక్షణ సభలో పాల్గొన్న ఆమె.. వైఎస్ సిఎంగా ఉన్న సమయంలో రాష్ట్రం పచ్చగా ఉందన్నారు. ప్రజల కోసం ఎన్నో పథకాలు తెచ్చారని, ఉచిత కరెంట్ తో వ్యవసాయం అంటే పండుగ అని తెలిపారు షర్మిల. ఆరోగ్య శ్రీ(Arogya Sri) పేదలకి సంజీవని అని, ఫీజు రీయంబర్స్ మెంట్ పథకంతో కోట్ల మంది ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
వైఎస్ తెచ్చిన ప్రతీ ఒక్క పథకం అద్భుతం అని కొనియాడారు.వైఎస్ ఆశయాల నుంచే కరువు పని పుట్టిందని ఆనాడు 2006 లో వైఎస్ సిఎంగా ఉన్నప్పుడే.. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ , సోనియా గాంధీ ఈ పథకాన్ని బండ్లపల్లి నుంచి ప్రారంభించారని గుర్తు చేసారు. మన్రేగా పథకం రాష్ట్రంలో ఆనాడు ఘనవిజయం సాధించిందని, రాష్ట్ర గ్రామీణ అభివృద్ధికి మన్రేగా ఎంతో దోహదం చేసిందని పేర్కొన్నారు. కరువు పని తో రాష్ట్రంలో వలసలు తగ్గాయని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
నేడు కరువు పనిని బీజేపీ ప్రభుత్వం ఖూనీ చేసిందని మండిపడ్డారు. పథకాన్ని పూర్తిగా నీరు గార్చిందని, పేదవాడి పొట్ట గొట్టాలని కుట్రలు చేసిందని ఆరోపించారు. పేరు మార్చే చట్టానికి మద్దతు ఇచ్చి మోడీ దగ్గర నిధులు ఇవ్వాలని ఎందుకు దేహి అంటున్నారు ? అని నిలదీశారు. గ్రామ్ జి చట్టానికి మద్దతు ఇచ్చి చంద్రబాబు(Chandrababu Naidu) తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. మోదీ చట్టానికి జగన్ సైతం వ్యతిరేకించడం లేదని, జగన్ సైతం మోదీకి బానిస అని మండిపడ్డారు. మోదీ చేతిలో జగన్(Ys Jagan) కీలుబొమ్మ అంటూ ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన , వైసీపీ పార్టీలు మోదీకి గులాం గురి చేసే పార్టీలు అని విమర్శించారు.
ఇవి కూడా చదవండి













