Paragliding Accuracy: ఉత్తరాఖండ్‌లో జాతీయ పారాగ్లైడింగ్ సందడి.. విజేతలు వీరే!
ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ జిల్లా, కప్కోట్ (Kapkot) వేదికగా జరిగిన ‘నేషనల్ పారాగ్లైడింగ్ ఆక్యూరసీ ఛాంపియన్షిప్’ (National Paragliding Accuracy Championship) ఘనంగా ముగిసింది. స్థానిక జలేఖ్ (Jalekh) కొండల్లో జరిగిన ఈ సాహస క్రీడా పోటీల్లో దేశవ్యాప్తంగా దాదాపు 64 మంది పైలట్లు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పర్యాటక రంగానికి, సాహస క్రీడలకు ఊతమిచ్చేలా ఈ పోటీలు జరిగాయని అధికారులు తెలిపారు. కప్కోట్ ప్రాంతం పారాగ్లైడింగ్కు అత్యంత అనుకూలమైన భౌగోళిక పరిస్థితులను కలిగి ఉందని, ఈ ఛాంపియన్షిప్ విజయవంతం కావడం ఇక్కడి పర్యాటక అవకాశాలను మరింత పెంచుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ (Paragliding Accuracy) ఛాంపియన్‌షిప్‌లో మనీష్ ఉపేత్రి (Manish Upreti) ప్రథమ స్థానంలో నిలిచి రూ. 1 లక్ష నగదు బహుమతిని గెలుచుకున్నారు. రెండో స్థానంలో నిలిచిన మనీష్ భండారికి రూ. 50,000, మూడో స్థానంలో నిలిచిన పంకజ్ కుమార్‌కు రూ. 30,000 నగదు పురస్కారం అందజేశారు. అలాగే ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఐదుగురు మహిళా పైలట్లకు ప్రోత్సాహక బహుమతిగా ఒక్కొక్కరికి రూ. 5,000 చొప్పున అందజేశారు. పోటీల్లో (Paragliding Accuracy) పాల్గొన్నవారిలో మేఘాలయకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జిల్లా కౌన్సిల్ సభ్యుడు బాజోప్ పింగ్రోప్ (Bajop Pingrop) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పారాగ్లైడింగ్ క్రమశిక్షణను, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని, కొండ ప్రాంతాల్లోని యువత సాహస క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవాలని ఆయన సూచించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ (Paragliding Accuracy) పోటీల్లో గుజరాత్ నీటిపారుదల శాఖకు చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ నచికేత గుప్తా, పితోర్‌గఢ్‌కు చెందిన 60 ఏళ్ల సీనియర్ పైలట్ భువన్ చంద్ర పనేరు వంటి వైవిధ్యభరితమైన నేపథ్యం ఉన్న వ్యక్తులు పాల్గొన్నారు. ఇక డెహ్రాడూన్‌కు చెందిన స్పీడ్-వింగ్ పైలట్ (Speed-wing Pilot) హిమాన్షు గుప్తా ప్రత్యేక ప్రదర్శన చేశారు. గంటకు 115 కి.మీ వేగంతో జలేఖ్ నుంచి కేదారేశ్వర్ వరకు ఉన్న దూరాన్ని కేవలం రెండున్నర నిమిషాల్లో చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. భవిష్యత్తులో ఇలాంటి సాహస క్రీడలను మరింతగా ప్రోత్సహిస్తామని జిల్లా కలెక్టర్ ఆకాంక్ష కొండే (Akanksha Kondae) తెలిపారు.













