Rohit-Kohli: రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ బిగ్ షాక్.. బి-గ్రేడ్ కాంట్రాక్ట్‌లు!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీసుకున్న తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా క్రీడా వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. 2025-26 సీజన్‌కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఇందులో భారత క్రికెట్ దిగ్గజాలు, మైదానంలో పరుగుల వరద పారిస్తున్న మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు (Rohit-Kohli) గట్టి షాక్ తగిలింది. దశాబ్ద కాలంగా భారత క్రికెట్‌కు మూలస్తంభాలుగా నిలిచిన వీరిద్దరిని బీసీసీఐ అనూహ్యంగా ‘గ్రేడ్-బి’ కేటగిరీకి (Grade B) తగ్గించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకప్పుడు అత్యధిక పారితోషికం అందుకునే ‘గ్రేడ్ ఏ+’ జాబితాలో ఉన్న ఈ ఇద్దరు సీనియర్లను నేరుగా ‘గ్రేడ్-బీ’ కేటగిరీకి డీమోట్ చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అంతేకాదు పూర్తిగా ‘ఏ+’ కేటగిరీని బీసీసీఐ పూర్తిగా తొలగించడం గమనార్హం.
టీ20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన తర్వాత వీరు కేవలం వన్డే సిరీస్‌లకు మాత్రమే ఆడుతున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లకు, అన్ని ఫార్మాట్లలో ఆడేవారికి ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతోనే బీసీసీఐ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. రోహిత్, కోహ్లీల (Rohit-Kohli) స్థానాలను ఇప్పుడు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, జస్ప్రీత్ బుమ్రా వంటి వారు ఆక్రమించే దిశగా అడుగులు వేస్తున్నారు. వీరిని ఎగువ కేటగిరీల్లోకి తీసుకురావడం ద్వారా బోర్డు స్పష్టమైన సంకేతాలను పంపింది. భారత క్రికెట్ ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రక్షాళన దిశగా సాగుతోందనడానికి, యువ రక్తానికి పెద్దపీట వేస్తోందనడానికి ఇదొక నిదర్శనం.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మరోవైపు రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు తమ స్థానాలను పదిలం చేసుకోగా, గాయాల బారిన పడుతున్న కొందరు బౌలర్లకు కాంట్రాక్టుల్లో కోత తప్పలేదు. ఏది ఏమైనా, రోహిత్, విరాట్ (Rohit-Kohli) వంటి లెజెండ్స్ గ్రేడ్ బి జాబితాలో కనిపించడం అభిమానులకు మింగుడుపడటం లేదు. అయితే, ఆటలో మార్పు సహజమని, కొత్త తరం బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉందని బీసీసీఐ ఈ కాంట్రాక్టుల ద్వారా చెప్పకనే చెప్పింది.













