T20 World Cup: అమెరికాపై పాకిస్థాన్ భారీ విజయం.. రాణించిన ఫర్హాన్
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup) పాకిస్థాన్ సత్తా చాటింది. గ్రూప్-ఏలో భాగంగా జరిగిన 12వ లీగ్ మ్యాచ్‌లో అమెరికా (USA)పై పాకిస్థాన్ ఘన విజయాన్ని నమోదు చేసింది. గత ప్రపంచకప్‌లో అమెరికా చేతిలో ఎదురైన అనూహ్య పరాభవానికి పాక్ ఈసారి మైదానంలో గట్టిగా బదులు తీర్చుకుంది. ఈ మ్యాచ్ ఆద్యంతం పాక్ ఆటగాళ్లు కసిగా ఆడి, జట్టుకు విజయాన్ని అందించారు.
టాస్ విషయంలో అదృష్టం కలిసొచ్చిన పాకిస్థాన్.. ఆ తర్వాత ఆటలోనూ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగుల భారీ స్కోరును సాధించింది. షాహిబ్జానా ఫర్హాన్ (73), బాబర్ ఆజమ్ (46), షాదాబ్ ఖాన్ (30) రాణించారు. యూఎస్ఏ బౌలర్లలో షాడ్లీ వాన్ షాలీక్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఛేదనలో పాకిస్థాన్ బౌలింగ్ దళం కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు విసిరి అమెరికా బ్యాటర్లను క్రీజులో కుదురుకోనివ్వలేదు. యూఎస్ బ్యాటర్లలో షాయన్ జహంగీర్ (29), మిలింద్ కుమార్ (29), శుభమ్ రాంజానే (51) మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో యూఎస్ఏ నిర్ణీత 20 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో ఉస్మాన్ తారిక్ మూడు, షాదాబ్ ఖాన్ 2 వికెట్లు తీసుకున్నారు. పాక్‌కు భారీ స్కోరు అందించిన ఫర్హాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.













