T20 World Cup: సీఫెర్ట్ సూపర్ ఇన్నింగ్స్.. యూఏఈపై కివీస్ విక్టరీ
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup) న్యూజిలాండ్ జట్టు భారీ విజయం సాధించింది. గ్రూప్-డీలో భాగంగా మంగళవారం జరిగిన 11వ లీగ్ మ్యాచ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)పై కివీస్ ఘన విజయాన్ని నమోదు చేసింది. పటిష్టమైన న్యూజిలాండ్ బౌలింగ్ దాడి సమర్థవంగా ఎదుర్కొన్న యూఏఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగుల బలమైన స్కోరు చేసింది. ఆ టీం కెప్టెన్ ముహమ్మద్ వసీమ్ (66 నాటౌట్), అలిషాన్ షరాఫూ (55), మయాంక్ కుమార్ (21) రాణించారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ రెండు వికెట్లతో రాణించగా.. జాకబ్ డఫ్ఫీ, లోకీ ఫెర్గూసన్, మిచెల్ శాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ తీసుకున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఛేజింగ్లో కివీస్ ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ (89 నాటౌట్), ఫిన్ అలెన్ (84 నాటౌట్) అదరగొట్టారు. వీళ్లిద్దరూ యూఏఈ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఎడాపెడా బౌండరీలతో చెలరేగారు. సీఫెర్ట్ 12 ఫోర్లు, 3 సిక్సర్లు బాదగా.. అలెన్ 5 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. యూఏఈ బౌలర్లను ఉతికారేసిన వీరిద్దరూ కేవలం 15.2 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా న్యూజిల్యాండ్కు విజయం కట్టబెట్టారు. అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడిన సీఫెర్ట్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.













