T20 World Cup: బాస్ డి లీడ్ ఆల్రౌండ్ షో.. నమీబియాపై నెదర్లాండ్స్ ఘన విజయం
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup) పసికూనల పోరులో నెదర్లాండ్స్ జట్టు జయకేతనం ఎగరేసింది. నమీబియాతో జరిగిన మ్యాచులో నెదర్లాండ్స్ ఆల్రౌండర్ బాస్ డి లీడ్స్ (72 నాటౌట్, 2 వికెట్లు) చెలరేగాడు. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా.. నెదర్లాండ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 20 ఓవర్లలో కేవలం 156/8 స్కోరు మాత్రమే చేయగలిగింది. జే ఫ్రిలింక్ (30), జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ (42), జేజే స్మిత్ (22) రాణించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగన్ వాన్ బీక్, బాస్ డి లీడ్ చెరో రెండు వికెట్లతో రాణించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఛేజింగ్లో 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 18 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ మైఖేల్ లెవిట్ 15 బంతుల్లో 28 పరుగులతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బాస్ డి లీడ్.. నమీబియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 48 బంతుల్లో 4 సిక్సర్లు, 5 ఫోర్లతో అజేయంగా 72 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతనికి కోలిన్ అకెర్మాన్ (32) చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ మూడో వికెట్కు 70 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ గెలుపుతో నెదర్లాండ్స్ (T20 World Cup) పాయింట్ల పట్టికలో తన ఖాతాను తెరిచింది. నమీబియా తన తదుపరి మ్యాచ్లో గురువారం ఇదే వేదికపై టీమిండియాతో తలపడనుంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ రాణించిన స్టార్ ఆల్రౌండర్ బాస్ డి లీడ్ (Bas de Leede) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.













