Ranji Trophy: ఆంధ్రా ఓటమి.. రంజీ ట్రోఫీ సెమీస్‌కు బెంగాల్!
రంజీ ట్రోఫీ (Ranji Trophy) క్వార్టర్స్‌లో ఆంధ్ర టీం ప్రయాణం ముగిసింది. మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్ చేతిలో ఆంధ్రా టీం ఓటమిపాలైంది. సెమీఫైనల్ బెర్త్ కోసం తప్పక గెలవాల్సిన మ్యాచులో ఆంధ్ర జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేదు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగాల్ జట్టు.. తొలి ఇన్నింగ్సులో ఆంధ్రను 295 పరుగులకు ఆలౌట్ చేసింది. ఈ జట్టులో శ్రీకర్ భరత్ (47), షేక్ రషీద్ (46), కెప్టెన్ రిక్కీ భుయ్ (83), నితీష్ కుమార్ రెడ్డి (33) పోరాడారు. బెంగాల్ బౌలర్లలో ముఖేష్ కుమార్ ఐదు, ఆకాష్ దీప్ 4 వికెట్లతో అదరగొట్టారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ టీం అదరగొట్టింది. ముఖ్యంగా సుదీప్ కుమార్ ఘరామీ (299) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అతనితోపాటు సుమంత గుప్తా (81), హబీబ్ గాంధీ (95), మహమ్మద్ షమీ (53) కూడా రాణించారు. దీంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్సులో 629 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచులో (Ranji Trophy) ఆంధ్ర బౌలర్లలో షేక్ రషీద్ నాలుగు వికెట్లతో రాణించాడు. కేవీ శశికాంత్, సౌరభ్ కుమార్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆంధ్ర జట్టు రెండో ఇన్నింగ్సులో కేవలం 244 పరుగులకే ఆలౌట్ అయింది. నితీష్ కుమార్ రెడ్డి (90), త్రిపురన విజయ్ (46), కెప్టెన్ రిక్కీ భుయ్ (30), సీఆర్ జ్ఞానేశ్వర్ (20), కలిదిండి రాజు (25) పోరాడినా ఫలితం దక్కలేదు. దీంతో 90 పరుగుల తేడాతో బెంగాల్ విజయం సాధించింది. బెంగాల్ బౌలర్లో షెహబాజ్ అహ్మద్ నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. సూరజ్ సింధూ జైస్వాల్ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఈ విజయంతో బెంగాల్ జట్టు రంజీ ట్రోఫీ (Ranji Trophy) సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది.













