యానిమేటెడ్ వెర్ష‌న్ తో రికార్డు సృష్టించనున్న ఆర్ఆర్ఆర్

10 February 2026

ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి మరోసారి సెన్సేషన్‌కు సిద్ధమయ్యారు. బాహుబలి బాటలోనే ఇప్పుడు RRR యానిమేటెడ్ మూవీగా రాబోతుంది.

RRR యానిమేటెడ్ వెర్షన్‌ను అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించనున్నారు. ముఖ్యంగా జపాన్, అమెరికా మార్కెట్లలో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం

యానిమేషన్ రూపంలో RRR కథను మరింత ఫాంటసీ, యాక్షన్ ఎలిమెంట్స్‌తో కొత్తగా చూపించే అవకాశం ఉంది. ఇది ఒరిజినల్ మూవీకి భిన్నమైన అనుభూతిని ఇవ్వనుంది

హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకటన లో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ విష‌యాన్ని కన్ఫర్మ్  చేశారు. 

RRRని యానిమేషన్ వెర్షన్‌గా తీసుకురావాలనే ప్లాన్ దీనిలో భాగంగా జపనీస్ యానిమేషన్ స్టూడియోలతో ప్ర‌స్తుతం చర్చలు జరుగుతున్నాయి. 

అన్నీ కుదిరితే త్వరలో ప్రాజెక్ట్ మొద‌ల‌వ‌నుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన RRR మూవీ వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ అయిన సంగ‌తి తెలిసిందే 

యానిమేటెడ్ వెర్షన్‌లో హై-ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యానిమేషన్ టెక్నాలజీ ఉపయోగించి RRRను మరింత గ్రాండ్‌గా చూపించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది 

దీంతో ఇండియన్ యానిమేషన్‌కు కొత్త దశ రాబోతుంద‌నే చెప్పాలి 

ఫాలో అవ్వండి.