పూజ చేసినప్పుడు హారతి ఇవ్వడానికి ఉపయోగించే కర్పూరం ఎన్నో రకాలైన సమస్యలకు పరిష్కారం అన్న విషయం మనలో చాలామందికి తెలియదు..
ఇంట్లో కనిపించే దోమలు, చీమలు వంటి కీటకాలను దూరం చేయడంలో కర్పూరం సహజ పరిష్కారంగా ఉపయోగపడుతుంది.
కర్పూరం నుంచి వెలువడే ఘాటు వాసన కీటకాలకు అస్సలు భరించలేవు..అందుకే అవి ఆ ప్రాంతానికి దూరంగా ఉంటాయి.
చిన్న కర్పూరం ముక్కలను గదుల మూలల్లో లేదా కిటికీల దగ్గర ఉంచడం వల్ల రూమ్ మంచి సువాసనతో నిండడంతో పాటు కీటకాలు కూడా రాకుండా ఉంటాయి..
కెమికల్స్ తో నిండిన స్ప్రేస్, ఇంసెక్ట్ రిపెలెంట్స్ వాడడం కంటే కూడా కర్పూరం ఉపయోగించడం సురక్షిత.
ప్రత్యేకంగా పిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లలో ఇది మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.