సినిమాల కంటే రూమ‌ర్ల‌తోనే ఫేమ‌స్ అయిన హీరోయిన్ 

09 February 2026

మృణాల్ ఠాకూర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. టీవీ న‌టి నుంచి హీరోయిన్ గా మారిన మృణాల్ సీతారామంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

ఆ త‌ర్వాత హాయ్ నాన్న మూవీతో మ‌రో స‌క్సెస్ ను అందుకున్న మృణాల్ కు ఆశించిన స్థాయిలో అవ‌కాశాలు మాత్రం రాలేదు.

ప్ర‌స్తుతం బాలీవుడ్ లో వ‌రుస సినిమాలు చేస్తూ అక్క‌డే బిజీగా ఉన్న మృణాల్ తెలుగులో డెకాయిట్ అనే మూవీ చేస్తోంది.

అయితే మృణాల్ చేసింది త‌క్కువ సినిమాలే అయినా ఆమె సినిమాల‌తో కంటే రూమ‌ర్ల ద్వారానే ఎక్కువ వార్త‌ల్లో నిలుస్తోంది.

త‌మిళ హీరో ధ‌నుష్ తో మృణాల్ ప్రేమ‌లో ఉంద‌ని, వేలంటైన్స్ డే రోజున వారిద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్నార‌ని గ‌త కొన్నాళ్లుగా వార్త‌లొస్తున్నాయి.

ఈ వార్త‌ల‌పై అటు ధ‌నుష్ కానీ, ఇటు మృణాల్ కానీ రెస్పాండ్ అవ‌లేదు. దీంతో పాటూ బాలీవుడ్ హీరో సిద్దార్ధ్ చ‌తుర్వేదితో మృణాల్ రిలేష‌న్ లో ఉంద‌ని కూడా వార్త‌లొస్తున్నాయి

ఈ వార్త‌ల్లో నిజ‌మెంత‌న్న‌ది ప‌క్కన పెడితే మృణాల్ సినిమాల‌తో కంటే ఇలాంటి ప్ర‌చారాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల్లోకెక్కుతుంది.  

ఫాలో అవ్వండి.